International Womens Day 2024 : ఉమెన్స్ డే విషెష్ను ఇలా చెప్పేయండి.. ఈ ఫోటోలు పంపేయండి
నీ జీవితానికి నువ్వే క్వీన్. క్వీన్స్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? వాళ్లు దేనికి భయపడరు. తమ వైఫల్యాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తారు. నువ్వు కూడా అలా వెళ్లాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసమాన హక్కులు ఎప్పుడైనా ప్రత్యేక హక్కులు కావు. అవి నీకు ఒకరు ఇచ్చేది కాదని గుర్తించుకో. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
కష్ట, నష్టాలు ఎన్ని ఎదురైనా.. మీరు జీవితంలో ఎలాంటి సమయంలో కూడా ఆగిపోకూడదని.. మీరు కోరుకున్న జీవితాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే.
సోదరిగా, కుమార్తెగా, తల్లిగా, భార్యగా.. ఇలా జీవితంలో ప్రతి దశలోనూ నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించి.. ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
స్త్రీలు ఎప్పుడూ బలహీనులు కాదు. ఎందుకంటే.. దేవుడు వారిని ప్రతి కోణంలోనూ బలవంతులుగా చేశారు. తమని తాము తక్కువ చేసుకోకుండా.. తక్కువ చేసే వారి మాటలు పట్టించుకోకుండా లైఫ్లో సకెస్స్ కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే.
ఈరోజు నేను ఇంత ఉన్నత స్థానంలో ఉంటే అది నీ వల్లనే అమ్మ. నాకోసం నువ్వు చేసిన త్యాగాలను నేను వెలకట్టలేను. నీ గర్భంలో నాకు చోటిచ్చి.. నీ ప్రేమతో నన్ను పెంచి పెద్ద చేసిన నీకు ఎంత ప్రేమను అందించినా.. రుణం తీరదు. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
బౌండరీలు సెట్ చేసి.. మహిళలు ఇదే చేయాలని రూల్ లేదు. కొన్నిసార్లు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బౌండరీలు దాటాల్సి వచ్చిన తప్పేమి కాదనే విషయం తెలుసుకోవాలి. హ్యాపీ ఉమెన్స్ డే.
మీరు జీవితంలో అన్ని విజయాలు సాధించాలని.. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నారు. హ్యాపీ ఇంటర్నెషనల్ ఉమెన్స్ డే.