Instagram's New Feature : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్.. సోషల్ మీడియా వ్యసనం మరింత పెరగనుందా?
ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆటో స్క్రోల్ తీసుకురాబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనివల్ల వినియోగదారులను ప్లాట్‌ఫారమ్‌తో మరింతగా కనెక్ట్ చేస్తుంది. అయితే ఈ ఫీచర్ వచ్చిన తర్వాత రీల్స్ చూడటానికి వినియోగదారులు ఇక స్క్రీన్‌ను స్క్రోల్ చేయనవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫేస్బుక్, థ్రెడ్స్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. అందులో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ విభాగంలో 'ఆటో స్క్రోల్' అనే కొత్త ఆప్షన్ కనిపిస్తోంది. ఇది ఒక కొత్త ఫీచర్ అని కూడా రాసి ఉంది. అంటే రీల్స్ ఆటోమేటిక్‌గా స్క్రోల్ అవుతూ ఉంటాయి.
అమర్ ఉజాలా బృందం స్వయంగా Instagram యాప్‌లో ఈ ఫీచర్‌ను కనుగొనేందుకు ప్రయత్నించినప్పుడు.. వారికి అలాంటి ఆప్షన్ కనిపించలేదు. అంటే.. ఈ వైరల్ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదని అర్థం. Instagram నుంచి కూడా ఈ ఫీచర్ గురించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
ఒకవేళ నిజంగానే ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తే.. ఇది సోషల్ మీడియా వ్యసనాన్ని మరింత పెంచుతుంది. ఎటువంటి ఆటంకం లేకుండా రీల్స్ చూస్తూ పోవడం వల్ల వినియోగదారులకు సమయం కూడా తెలియకుండా పోతుంది. దీనివల్ల వారి ప్రొడెక్ట్విటి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. నిపుణులు ఇప్పటికే 'డూమ్ స్క్రోలింగ్' గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆటో స్క్రోల్ దీనిని మరింత ప్రమాదకరంగా మార్చవచ్చు.
ప్రస్తుతం Instagramలో Auto Scroll ఫీచర్ అధికారికంగా ధృవీకరించలేదు. వైరల్ అవుతున్న స్క్రీన్షాట్లపై కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఈ ఫీచర్ నిజంగా వస్తే, ఇది సోషల్ మీడియా చరిత్రలో అత్యంత హానికరమైన మార్పులలో ఒకటిగా మారనుంది.