Home Loan Tips : హోమ్ లోన్ తీసుకునేప్పుడు కచ్చితంగా ఉండాల్సిన డాక్యూమెంట్స్ ఇవే.. అవి లేకుంటే రిజక్టే
ఇంటి కోసం లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంకులు కచ్చితంగా ముందుకు వస్తాయి. అయితే హౌస్ లోన్ తీసుకునేప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. రుణ కోసం బ్యాంక్ కచ్చితంగా అడిగే పత్రాలు ఏంటో.. అవి లేకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం.
మీరు హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే.. దరఖాస్తు చేసే ముందు ఈ డాక్యుమెంట్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల లోన్ కోసం అప్లై చేసేటప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. లోన్ త్వరగా మంజూరు అవుతుంది.
ఈ డాక్యుమెంట్లలో ఐడెంటీ ప్రూఫ్‌గా మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వంటి ఏదైనా డాక్యుమెంట్లను బ్యాంకుకు సమర్పించాలి. ఈ డాక్యుమెంట్ల ద్వారా బ్యాంకు మీ గుర్తింపు, మీ పౌరసత్వాన్ని నిర్ధారిస్తుంది.
అంతేకాకుండా మీరు ఎక్కడ నివసిస్తున్నారో బ్యాంకు తెలుసుకోవడం అవసరం. కాబట్టి దానికోసం కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, పాస్‌పోర్ట్ లేదా ఆధార్ కార్డును అడ్రెస్ ప్రూఫ్‌గా అడుగుతారు. తద్వారా ఈ పత్రాలపై ఇచ్చిన చిరునామా మీ ప్రస్తుత చిరునామా అని.. నిర్ధారిస్తారు.
మీరు ఉద్యోగం చేసే వారైతే.. మీరు జీతం స్లిప్, ఫారం 16 లేదా ఆదాయపు పన్ను రిటర్న్ కాపీని సమర్పించాలి. మీరు వ్యాపారం చేస్తే.. ఆదాయపు పన్ను రిటర్న్‌తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్, వ్యాపార వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ మీ లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ఈ డాక్యుమెంట్స్‌తో తనిఖీ చేస్తుంది.
అంతేకాకుండా గత ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం బ్యాంక్ స్టేట్మెంట్ల కాపీ, ఆస్తికి సంబంధించిన పత్రాలను కూడా చూపించాల్సి ఉంటుంది. మీరు కొనబోయే ఆస్తికి సంబంధించిన ఒప్పంద పత్రాలు, ఆస్తి పన్ను రసీదు, ఇతర చట్టపరమైన పత్రాలను బ్యాంక్ అడగవచ్చు.