Kids Mobile Usage Daily Schedule : పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? పేరెంట్స్ దానిని లిమిట్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అయిపోండి
పిల్లలకు మొబైల్ ఉపయోగించే సమయాన్ని షెడ్యూల్ చేయండి. చదువుకున్న తర్వాత రోజుకు 1 గంట మాత్రమే ఉపయోగించాలనే నిబంధన పెట్టాలి. దీనివల్ల పిల్లలు ఒక పరిమితిలో మొబైల్ వాడే వీలు ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమొబైల్కు బదులుగా పిల్లలను క్రికెట్, ఫుట్బాల్ లేదా సైక్లింగ్ వంటి ఆటలు ఆడేలా ప్రోత్సాహించాలి. దీనివల్ల వారి దృష్టి ఫోన్ నుంచి డైవర్ట్ అవుతుంది. శారీరక దృఢత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
పిల్లవాడు హోంవర్క్ లేదా ఏదైనా పని బాగా చేస్తేనే అతనికి మొబైల్ ఉపయోగించడానికి వీలు ఉంటుందని కండీషన్ పెట్టండి. ఈ విధంగా మొబైల్ వారికి వ్యసనంగా మారకుండా ఉంటుంది.
పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయం ఆడుకోండి. మాట్లాడండి. లేదా ఏదైనా యాక్టివిటీ చేయించండి. పిల్లలు వాటిలో నిమగ్నమైనప్పుడు మొబైల్ అవసరం తక్కువగా ఉంటుంది.
పిల్లలకు అర్థమయ్యేలా మొబైల్ ఎక్కువ వాడితే వచ్చే నష్టాలు చెప్పండి. ఫోన్ ఎక్కువ చూస్తే కళ్ళు బలహీనపడటం, నిద్ర సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలతో పాటు మెదడుపై ప్రభావం ఉంటుందని చెప్పండి. కారణాలను అర్థం చేసుకునేలా వివరిస్తే వినియోగం తగ్గుతుంది.
తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మొబైల్‌లో బిజీగా ఉంటే.. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల ముందు మొబైల్ వాడకాన్ని తగ్గించండి.
నిద్రపోయే ముందు పిల్లల చేతుల్లో మొబైల్స్ పెట్టవద్దు. నిద్ర గదిలో టీవీ, మొబైల్స్ ఉంచకపోవడమే మంచిది. దీనివల్ల నిద్ర, దినచర్య రెండూ మంచిగా ఉంటాయి.