Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Hibiscus for Hair Growth : జుట్టు రాలిపోతుందా? అయితే మందారను హెయిర్‌కి ఇలా అప్లై చేయండి
మందార ఆకులు, పువ్వులు జుట్టుకు, చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోతున్నప్పుడు మందార పువ్వులను ఉపయోగించి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.(Images Source : Envato)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమందార పువ్వులో ఫ్లేవనాయిడ్స్, అమినో యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ నుంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. అంతేకాకుండా సహజమైన మెరుపు మీ సొంతమవుతుంది.(Images Source : Envato)
మందార పూలను పెరుగులో వేసి పేస్ట్ చేసుకోవాలి. దీనిని జుట్టుకు అప్లై చేసి.. 45 నిమిషాలు ఉంచాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఓసారి చేస్తే మంచి ఫలితముంటుంది.(Images Source : Envato)
మందారను పొడిగా చేసుకుని.. దానిని కొబ్బరి నూనెలో కలుపుకోవాలి. దీనిని రెగ్యూలర్‌గా హెయిర్‌కి ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. (Images Source : Envato)
మందార పొడి, ఉసిరి, మెంతుల పొడిని కూడా హెయిర్ ప్యాక్‌గా అప్లై చేసుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ చుండ్రు సమస్యలను కూడా తగ్గిస్తుంది. (Images Source : Envato)
మందార ఆకులు, పువ్వులను పేస్ట్ చేసి.. కుంకుడు కాయలతో పాటు నానబెట్టి.. వాటితో తలస్నానం చేసినా జుట్టు బాగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. (Images Source : Envato)