Ash Gourds Juice : బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా మంచిది.. కానీ ఆ విషయాల్లో జాగ్రత్త
బూడిద గుమ్మడికాయ రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు. ఇంతకీ దీనివల్ల కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు కూడా ఉన్నాయా? అసలు దీనిని తాగవచ్చా? లేదా?(Image Source : Pinterest)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబూడిద గుమ్మడి న్యూట్రిషనల్ వాల్యూస్‌తో నిండి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలోని ఎలక్ట్రోలైట్స్ మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. డ్రై స్కిన్ వంటి సమస్యలున్నవారు దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. (Image Source : Pinterest)
కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలున్నవారు దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. జీర్ణ సమస్యలను దూరం చేసి మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. (Image Source : Pinterest)
దీనిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కణాలను రిపేర్ చేస్తాయి. క్రోనికల్ సమస్యలు రాకుండా రక్షిస్తాయి. దీనిలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. (Image Source : Pinterest)
బూడిద గుమ్మడిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి, వాపును దూరం చేస్తాయి. అలాగే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టుకు, స్కిన్‌కి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. (Image Source : Pinterest)
బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆప్షన్. దీనిలోని ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఈ జర్నీ కోసం మీరు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి. (Image Source : Pinterest)
కొందరిలో బూడిద గుమ్మడి అలెర్జీని కలిగిస్తుంది. దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ ప్రయోజనాలు కావాలని ఎక్కువ తాగితే.. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. (Image Source : Pinterest)
షుగర్ ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. డయాబెటిస్ మెడిసిన్, రక్తం చిక్కగా ఉన్నవారు బూడిద గుమ్మడి జ్యూస్ తాగవద్దని చెప్తున్నారు. (Image Source : Pinterest)