HIV/AIDS Risk : శృంగారం ఎంతమందితో చేస్తే ఎయిడ్స్ వస్తుంది? ఒకరా? ఇద్దరా? అంతకుమించా?
ఎక్కువమందితో శారీరక సంబంధం పెట్టుకుంటే HIV వ్యాప్తి చెందుతుంది. HIV సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు అంటే రక్తం, స్పెర్మ్, యోని స్రావాలు లేదా పురీషనాళం ద్రవాలు.. వైరస్ సోకని వ్యక్తి రక్తంలోకి ప్రవేశించినప్పుడు హెచ్‌ఐవీ వస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే నిపుణులు ఏమి చెప్తున్నారంటే.. హెచ్ఐవి లేదా ఎయిడ్స్ ప్రమాదం భాగస్వాముల సంఖ్యపై మాత్రమే ఆధారపడి ఉండదని చెబుతున్నారు. కండోమ్ వాడకం, భాగస్వామి హెచ్ఐవి స్థితి, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్టిఐలు) వంటి అనేక కారణాలు దీనికి కారణమవుతాయని చెప్తున్నారు.
శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు HIV వ్యాప్తి చెందే ప్రమాదం వేరుగా ఉంటుందని ఓ అధ్యయనం తెలిపింది. కండోమ్ లేకుండా మలద్వారం ద్వారా లైంగిక చర్యలో పాల్గొంటే.. 1.38 శాతం ప్రమాదం ఉంటుందని.. అదే యోని ద్వారా లైంగిక చర్యలో పాల్గొంటే ఈ ప్రమాదం 0.08% ఉంటుందని తెలిపింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం హెచ్ఐవి, ఎయిడ్స్ ప్రమాదం భాగస్వాముల సంఖ్య పెరిగేకొద్దీ పెరుగుతుందట. ఎందుకంటే ప్రతి కొత్త భాగస్వామి కొత్త ప్రమాదాన్ని తెస్తారు. ఒకవేళ అతను హెచ్ఐవి పాజిటివ్ అయితే.. అతను వ్యాధి ఇతరులకు బదిలీ అవుతుంది.
ఢిల్లీకి చెందిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిపుణుడు డాక్టర్ జతిన్ అహుజా ప్రకారం.. ఒకే భాగస్వామితో శారీరక సంబంధం కలిగి ఉండటం కూడా ప్రమాదకరమే. ఒకవేళ అతనికి హెచ్ఐవి సోకినట్లయితే అది భాగస్వామికి కూడా సమస్యలను కలిగిస్తుంది. ఆ తరువాత భాగస్వాముల సంఖ్య పెరిగేకొద్దీ ప్రమాదం కూడా అనేక రెట్లు పెరుగుతుంది.
ఒకవేళ మీ భాగస్వామి HIV పాజిటివ్ అయితే.. అతను యాంటీ-రెట్రోవైరల్ థెరపీ (ART) తీసుకోకపోతే.. ప్రతిసారి శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు HIV సంక్రమణ ప్రమాదం ఉంటుందని.. ది లాన్సెట్లో ప్రచురించారు. HIV పాజిటివ్ భాగస్వామి ART తీసుకుంటుంటే అతని వైరల్ లోడ్ తగ్గితే.. సంక్రమణ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.