Remedies to Relieve Headaches : తలనొప్పిని తగ్గించి సింపుల్ ఇంటి చిట్కాలు ఇవే.. మైగ్రెన్ కూడా తగ్గిపోతుందట
అల్లం టీ నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తలనొప్పిని ముఖ్యంగా సైనస్ ఒత్తిడిని లేదా వికారంతో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. తాజా అల్లం ముక్కలను వేడి నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. వడకట్టి దానిని సిప్ చేయండి. ఇది మీకు రిలీఫ్ ఇస్తుంది. Shraavana Month
ఐస్ ప్యాక్ లేదా ఐస్ క్యూబ్స్‌ను క్లాత్‌లో చుట్టి.. నుదిటిపై లేదా మెడ వెనుక భాగంలో ఉంచాలి. దీనివల్ల రక్త నాళాలు సంకోచిస్తాయి. నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్లు, టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పులకు ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది.
పుదీనా నూనెకు సహజంగా శరీరాన్ని చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని చుక్కల నూనెను నుదురు మీద రాసి నెమ్మదిగా మసాజ్ చేయండి. రిఫ్రెష్ అవుతారు.
మెగ్నీషియం అధికంగా ఉండే స్నాక్స్ తింటే నరాల, కండరాల పనితీరు మెరుగవుతుంది. తలనొప్పి తగ్గుతుంది. బాదం, అరటికాయ, గుమ్మడి గింజలు, పాలకూర బెస్ట్ ఆప్షన్స్. ఇవి నరాలను సడలించి తలనొప్పిని తగ్గిస్తాయి.
క్రమరహితమైన లేదా సరిపోని నిద్ర మీ శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. తలనొప్పిని పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడానికి, మేల్కొనడానికి ట్రై చేయాలి. ఇది తలనొప్పి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చామంతి మూలికా టీ నాడీ వ్యవస్థపై ప్రశాంతపరిచే ప్రభావాన్ని చూపుతుంది. తలనొప్పి, టెన్షన్-రకం తలనొప్పి, మైగ్రేన్లు, సరిగ్గా నిద్రపోకపోవడం లేదా నాడీ ఒత్తిడితో ముడిపడి ఉన్న సమస్యలను దూరం చేస్తుంది.
అక్యుప్రెషర్ పద్ధతులు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. సున్నితంగా వాటిపై ఒత్తిడి పెట్టడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉదాహరణకు మీ బొటనవేలు, చూపుడు వేలు మధ్య వెబ్‌ను కొన్ని నిమిషాలు నొక్కడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.
పాదాలను వేడి లేదా చల్లని నీటిలో పెడితే రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. ఇది సాధారణ, ప్రశాంతమైన చికిత్స. ఇది తలనొప్పి లక్షణాలను తగ్గిస్తుంది.