National Handloom Day 2025 : సొంత బ్రాండ్లతో చేనేతను ప్రమోట్ చేస్తోన్న హీరోయిన్లు.. ట్రెండ్‌తో మిక్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారుగా
రిచా చద్దా ఫ్యాషన్‌లో సస్టైనబిలిటీకి పెద్ద సపోర్ట్ర్. ఆమె తన భర్త అలీ ఫజల్‌తో కలిసి ఇహాబ్ అనే లేబుల్‌ని ప్రారంభించారు. దీనిలో చికన్కారి స్టైల్స్ కూడా ఉంటాయి. నేత కార్మికులకు గౌరవప్రదమైన ఉపాధిని అందిస్తుంది రిచా.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్వేతా చేనేత, స్థానిక కళలకు మద్దతు ఇస్తుంది. ఆమెకు ఫ్యాషన్ అనేది సమాజం, పర్యావరణం గురించి ఆలోచించే ఒక మార్గమని పలు సందర్భాల్లో చెప్పింది.
కృతిక తన స్వంత బ్రాండ్ సినాబార్ను ప్రారంభించింది. ఇది చందేరి నేతలకు మద్దతు ఇస్తుంది. అలాగే చేనెతతో ఫ్యాషన్ లుక్స్ ట్రై చేస్తుంది.
జాన్వీ కపూర్ కూడా చాలాసార్లు సాంప్రదాయ చీరలు ధరించింది. చేనేత, ట్రెడీషనల్ లుక్స్‌ని జాన్వీ చాలా బాగా పుల్ చేస్తుంది.
ప్రియాంకా చోప్రా తరచుగా బనారసి, చికంకారి వంటి సాంప్రదాయ వస్త్రాలను ధరిస్తుంది. భారతీయ కళను గర్వంగా ప్రదర్శిస్తూ ఉంటుంది.
దియా మిర్జా చాలా కాలంగా స్థిరమైన జీవనశైలిని పాటిస్తున్నారు. దానిలో చేనేత కూడా ఓ భాగమే. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయని ఆమె నమ్ముతారు.
ఆలియా చాలాసార్లు జమ్దానీ, చందేరీ వంటి చేనేత చీరలు ధరించింది. ట్రెండీగా తన లుక్స్ ఉండేలా చూసుకుంటుంది ఈ భామ.
సాయి మంజ్రేకర్ తన దుస్తుల ద్వారా.. సోషల్ మీడియా ద్వారా స్థానిక హస్తకళాకారులు, చేనేతను ప్రోత్సహిస్తుంది. యూత్‌ని బాగా ఎంగేజ్ చేస్తుంది.