Tips to Handle in-law Drama : అత్తగారు రోజూ తిడుతున్నారా? భర్త కూడా సపోర్ట్ చేయట్లేదా? వారి మనసు ఇలా గెలుచుకోండి
ముందుగా వారి ఇష్టాలు, ఇష్టం లేని విషయాలు తెలుసుకోండి. వారికి టీ అంటే ఇష్టమైతే.. వారికి సమయానికి దానిని అందించేందుకు ట్రై చేయండి. ఇలాంటి చిన్న చిన్న పనులే వారిని మీకు దగ్గర చేస్తాయి.
ఇంటి పనుల్లో సహాయం చేయండి. అలాగే మీ సొంత బాధ్యతలు కూడా తీసుకోండి. చెప్పకుండా పనులు చేయడం వల్ల మీరు ఇంటిని సొంతంగా, బాధ్యతతో ఉంటున్నారని వారికి అర్థమవుతుంది. ఇది వారి వైఖరిని నెమ్మదిగా మార్చవచ్చు.
భర్తతో ఫిర్యాదులు తగ్గించండి. అత్తగారితో నేరుగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఏవైనా అపార్థాలు ఉంటే.. ప్రేమ, గౌరవంతో వారికి వివరించండి. వారు వినకుంటే గొడవ పడకుండా అక్కడి నుంచి వెళ్లిపోండి. ఎందుకంటే గొడవలు సంబంధాలను మరింత దిగజార్చుతాయి.
కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలలో అత్తగారి అభిప్రాయాన్ని తప్పకుండా తీసుకోండి. వారి అభిప్రాయానికి విలువ ఉందని వారికి తెలియజేయండి. ఇది వారిలో మీ పట్ల గౌరవాన్ని, ఆప్యాయతను పెంచేందుకు హెల్ప్ అవుతుంది.
పండుగలు, కుటుంబ కార్యక్రమాలు లేదా చిన్న వేడుకలలో మీరు ఉత్సాహం చూపించండి. అత్తగారిని కూడా కలుపుకుని.. ఆమె అభిరుచిని గమనించండి. ఇది సంబంధంలో మాధుర్యాన్ని పెంచుతుంది. కుటుంబంలో మంచి స్థానం దొరుకుతుంది.
ఒత్తిడి లేదా కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి. వాదించే బదులు సరైన సమయం కోసం ఎదురు చూడండి. సమస్యను తెలివిగా పరిష్కరించండి. అత్తగారిని తప్పు అని నిరూపించడానికి ప్రయత్నించకుండా.. దానికి పరిష్కారం ఏమి ఉందో తెలుసుకోండి.
వీటిని చేయడం వల్ల వారి మనసులు ఒక్క రోజులో మారవు. కానీ కాస్త ఓపికతో ఉండండి. అలాగే మీరు ఎంత చేసినా వారు వేలు ఎత్తి చూపిస్తున్నారు, మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు అనుకున్నప్పుడు వారికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పటికీ వారిలో మార్పు రాకుంటే ఇంట్లో వారితో చెప్పండి. ఎందుకంటే బంధాలు కలుపుకోవడం అంటే ఎఫర్ట్స్ ఎప్పుడూ ఒకరి వైపు నుంచే ఉండకూడదు. వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటే రిలేషన్ బాగుంటుంది.