Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టవచ్చా? స్టడీ రూమ్‌లో ఈ మొక్కని పెడితే మంచిదా? కాదా?
దాదాపు అందరి ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది. మంచి లుక్ కోసం, శ్రేయస్సు, అభివృద్ధి కోసం దీనిని పెంచుతారు. అయితే స్టడీ రూమ్‌లో మనీ ప్లాంట్ పెడితే ఇంకా మంచిదంటున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్టడీ రూమ్‌లో మనీ ప్లాంట్ పెడితే.. ఆ గదిలో పాజిటివ్ ఎన్వరానిమెంట్ ఉంటుంది. ఇది సానుకూల శక్తిని అందించి.. ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండేలా చేస్తుంది.
ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీనివల్ల స్టడీ వల్ల, ఇతర కారణాల వచ్చే ఒత్తిడి తగ్గే అవకాశముంది. రూమ్‌లో మనీ ప్లాంట్ ఉంటే మీరు సంతోషంగా ఉంటారు.
ఈ ప్లాంట్ రూమ్‌లో ఉంటే స్టడీపై బాగా ఫోకస్ పెట్టగలుగుతారు. అంతేకాకుండా మీరు ఇతర పనులు చేసినా మీరు ఫోకస్‌గా ఉండేందుకు హెల్ప్ అవుతుంది.
మనీ ప్లాంట్ మీ చుట్టూ ఉన్న గాలిని స్వచ్ఛంగా ఉంచుతుంది. అలాగే ఈ ప్లాంట్ మనీ ప్లాంట్ అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి లక్ కోసం దీనిని మీ రూమ్‌లో పెట్టుకోవచ్చు.
కేవలం స్టడీ రూమ్‌నే కాదు.. ఇంట్లోని ఏ గదిలో మనీ ప్లాంట్ ఉన్నా ఆ పాజిటివ్ వైబ్ మీ చుట్టూ ఉంటుంది. పైగా ఇంట్లో మొక్కలు ఉంటే తెలియని హ్యాపీనెస్ ఉంటుంది.