Best Seeds for Men : మగవారు ఈ సీడ్స్​ రెగ్యులర్​గా తింటే చాలా మంచిదట.. స్పెర్మ్ సమస్యలను దూరం చేసుకోవడానికి ఇవి బెస్ట్

Mens Health : మగవారు ఆరోగ్యంగా ఉండేందుకు, లైంగిక సమస్యలను దూరం చేసుకునేందుకు రెగ్యులర్​ వ్యాయామాలతో పాటు డైట్​లో కొన్ని సీడ్స్ చేర్చుకోవాలి. అవేంటంటే..

Continues below advertisement

ఈ సీడ్స్ మగవారికి చాలా మంచివట (Image Source : Envato)

Continues below advertisement
1/6
శారీరక ఆరోగ్యంతో పాటు.. లైంగిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. ముఖ్యంగా మగవారు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంతో పాటు లైంగిక సమస్యలను దూరం చేసుకోవడానికి కొన్ని సీడ్స్​ని రెగ్యులర్​గా తినాలి. అవేంటో వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
2/6
గుమ్మడి గింజల్లో జింక్ ఉంటుంది. ఇది స్పెర్మ్ ప్రొడెక్షన్​ను పెంచి ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలోని ఫ్యాటీ యాసిడ్స్ స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి.
3/6
అవిసెగింజల్లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేసి కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేస్తాయి. అయితే ఫ్యామిలీ ప్లానింగ్​లో ఉన్నవాళ్లు.. స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉండేవారు తినకపోవడమే మంచిది.
4/6
చియాసీడ్స్ తింటే మగవారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. గుండె ఆరోగ్యానికి, కండరబలానికి, ఎనర్జిటిక్​గా ఉండేందుకు, హార్మోనల్ సమస్యలు తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
5/6
నువ్వుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ వృద్ధిని పెంచుతాయి. జ్ఞాపకశక్తితో పాటు లిబిడోను కూడా పెంచుతాయి. స్పెర్మ్ క్వాలిటీ మెరుగవుతుంది. ఆయుర్వేదం ప్రకారం నల్ల నువ్వులు తింటే ఇంకా మంచిది.
Continues below advertisement
6/6
సన్​ఫ్లవర్ సీడ్స్​లో విటమిన్ ఈ, జింక్, సెలినియం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు, సంతానోత్పత్తికి, స్పెర్మ్ సెల్స్​ని కాపాడడంలోనూ హెల్ప్ చేస్తాయి.
Sponsored Links by Taboola