Coffee Face Pack : ముఖానికి కాఫీ పౌడర్ మాస్క్ వేస్తే కలిగే లాభాలు ఇవే.. సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్
స్కిన్ కేర్‌లో భాగంగా ముఖానికి చాలామంది కాఫీ పౌడర్‌ను ఫేస్ ప్యాక్‌గా అప్లై చేస్తూ ఉంటారు. అయితే దీనివల్ల స్కిన్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ముఖానికి అప్లై చేసిన తర్వాత దీనివల్ల ముఖం గ్లో అవుతుంది.
కాఫీ పౌడర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మంపై మంటను తగ్గిస్తుంది. సమ్మర్ వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను ఇది దూరం చేస్తుంది.
అలాగే కాఫీ పౌడర్‌ను స్క్రబ్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
వేడివల్ల టాన్ ఎక్కువగా వస్తుంది. కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్, బ్లాక్ సర్కిల్స్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
కాఫీ పౌడర్లో కొబ్బరి నూనె, పంచదార వేసి కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తూ కడిగేయాలి.
ఇవి కేవలం అవగాహన కోసమే. కాఫీతో స్కిన్ అలెర్జీ ఉంటుందనుకునేవారు నిపుణుల సలహాతో దీనిని ఉపయోగించవచ్చు.