Marriage Age of Girls in India : దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయసు తెలుసా? ఏడాదికేడాదికి పెరిగిపోతుందంటోన్న రిపోర్ట్స్
తాజా నివేదికల ప్రకారం.. దేశంలో బాలికల సగటు వివాహ వయస్సు 22.9 సంవత్సరాలకు చేరుకుంది. గతంలో కంటే ఇది చాలా పెరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశంలోని వివిధ రాష్ట్రాల్లో బాలికల వివాహాల సగటు వయస్సులో వ్యత్యాసం కనిపించినప్పటికీ.. ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు ఎక్కువ వయస్సులో వివాహం చేసుకుంటున్నారో తెలుసా?
ఒక నివేదిక ప్రకారం.. జమ్మూ కాశ్మీర్ అమ్మాయిలు ఎక్కువ వయస్సులో వివాహం చేసుకుంటున్నారట. పెళ్లికి వారి సగటు వయస్సు 26.3 సంవత్సరాలుగా ఉంటుందట. పశ్చిమ బెంగాల్‌లో ఇది 21.3 సంవత్సరాలుగా ఉంది.
గత కొన్ని సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే.. భారతదేశంలో బాలికల వివాహాల సగటు వయస్సు నెమ్మదిగా పెరుగుతోందని తెలుస్తోంది.
2019లో బాలికల వివాహ వయస్సు సగటున 22.1 సంవత్సరాలుగా ఉంది. ఇది 2020లో 22.7కి పెరిగింది. 2021లో ఇది 22.5 కాగా, 2022లో ఇది 22.7కి చేరుకుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన అమ్మాయిల వివాహ వయస్సులో చాలా వ్యత్యాసం ఉంది. 2023 సంవత్సరంలో గ్రామీణ అమ్మాయిల సగటు వివాహ వయస్సు 22.4 కాగా, పట్టణ అమ్మాయిలది 24.3 గా ఉంది.
2022లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 22.2 ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో మహిళల వివాహాల సగటు వయస్సు 23.9 సంవత్సరాలుగా ఉంది.