Amla Benefits : ఉసిరికాయలను ఇలా తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందట
కార్తీకమాసంలో దొరికే ఉసిరి కాయలు కేవలం పూజకే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అందిస్తాయి. వీటిని కొన్ని రకాలుగా తీసుకుంటే డయాబెటిస్‌ని కూడా కంట్రోల్ చేయవచ్చట.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉసిరికాయలను కోసి.. గింజలు తీసేసి.. వాటితో జ్యూస్ చేసుకోవాలి. దానిలో నీరు వేసి డైల్యూట్ చేసి.. తాగితే చాలామంచిది. కాస్త తేనె కలిపి రెగ్యూలర్‌గా తీసుకుంటే మధుమేహం కంట్రోల్ అవుతుంది.
ఉసిరికాయలను పౌడర్‌గా చేసుకుని స్మూతీలు, యోగర్ట్, ఓట్మీల్లో కలిపి రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. దీనిలోని న్యూట్రిషనల్ వాల్యూలు పుష్కలంగా ఉంటాయి. మంచి రుచిని కూడా ఇస్తాయి.
ఉసిరి గింజలు కూడా డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తాయి. వీటిని సలాడ్స్‌లో ట్యాంగీ ఫ్లేవర్ కోసం ఉపయోగించుకోవచ్చు. కీరదోస, క్యారెట్స్, టోమాటోలతో సలాడ్ చేసుకుని వాటిలో ఈ గింజలు వేసుకుని తినొచ్చు.
ఉసిరికాయలతో పచ్చడి, నిల్వ పచ్చడి కూడా చేసుకుంటారు. వీటిని రెగ్యూలర్‌గా ఫుడ్స్‌తో కలిపి తినవచ్చు. ఇది షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది.
ఉసిరికాయలను నీటిలో వేసి మరిగించి.. ఉసిరి టీగా తీసుకోవచ్చు. దీనిలో అల్లం, నిమ్మకాయ వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని ఉసిరికాయలను డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.