Urmila matondkar: విడాకులు తీసుకుంటోన్న 'రంగీలా' బ్యూటీ ఊర్మిళ.. వాట్ నెక్ట్స్!
ఊర్మిళ మటోండ్కర్ అనేకన్నా రంగీలా బ్యూటీ అనగానే ఠక్కున గుర్తుపడతారు. ఆర్జీవీ హీరోయిన్ గా తెలుగులో ఓ వెలుగు వెలిగింది ఊర్మిళ. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన అంతం మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'అంతం', 'గాయం', 'అనగనగా ఒక రోజు', 'రంగీలా' మూవీస్ తో సక్సెస్ అందుకుంది.. మనీ మనీలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. బాలనటిగా, హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది.
త్వరలో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్న ఊర్మిళ ఉన్నపాటుగా వార్తల్లోకెక్కింది...ఎందుకంటే..ఆమె తన వైవాహిక బంధానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది
ఊర్మిళ విడాకులు కావాలంటూ నాలుగు నెలల క్రితమే కోర్టు మెట్లెక్కినట్టు తెలిసింది..పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం లేదని.. తను భర్తకు దూరంగా ఉండాలి అనుకుంటోందని టాక్.
ఫిబ్రవరి 4 2016లో మోసిన్ అక్తర్ మీర్ అనే వ్యాపారవేత్ను పెళ్లిచేసుకుంది...ఊర్మిళ కన్నా అక్తర్ వయసులో పదేళ్లు చిన్న. అప్పట్లో బాలీవుడ్ లో వీరి వివాహం చర్చనీయాంశమైంది
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా బంధువుల పెళ్లిలో ఇద్దరూ కలిశారు...రెండేళ్ల డేటింగ్ తర్వాత అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకుంది ఊర్మిళ....
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఊర్మిళ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. (image credit : Urmila Matondkar /Instagram)