Satyabhama Serial Today September 25th: మహదేవయ్యతో సత్య సవాల్ - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 25 ఎపిసోడ్ హైలెట్స్!
తన కొడుకుకోసం మహదేవయ్యతో గొడవపడతాడు చక్రవర్తి..ఆ తర్వాత కొడుకుని చూసేందుకు వెళతాడు..బాబాయ్ అంటూ ఎదురొచ్చిన క్రిష్ చూసి ఎమోషన్ అవుతాడు. కొడుకుని హన్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు చక్రవర్తి
ఏంటి బాబాయ్ నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు అంటాడు క్రిష్.. నీకు దూరంకావడమే నా సమస్య అని బాధపడతాడు చక్రవర్తి. ఎప్పుడూ ధైర్యంగా ఉండే బాబాయ్ ని మొదటిసారి ఇలా చూస్తున్నా..ఏమైంది బాబాయ్ అని ఆప్యాయంగా అడుగుతాడు..
సత్య నేను విడిపోయేవరకూ వచ్చినా నీవల్లే ఇద్దరం కలిశాం..అందుకు నీకు రుణపడి ఉంటానంటాడు. అప్పుడే అక్కడకు వచ్చిన సత్యను పిలిచి ఇద్దరూ ఆశీర్వాదం తీసుకుంటారు.
ఇంతలో చక్రవర్తి తల్లి వచ్చి నన్ను వదిలేశావు..నీతో పాటు తీసుకెళ్లు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేనే ఇక్కడకు వస్తుంటా..నీకోసం మాత్రమే కాదు నా కొడుకుకోసం కూడా అనుకుంటాడు చక్రవర్తి..
నిద్రపోతున్న క్రిష్ ని చూసి సత్య..మహదేవయ్య మాటలు తలుచుకుని బాధపడుతుంది. నీకు నిజాలు చెప్పి ఈ ఉచ్చునుంచి బయటకు తీసుకెళతాను..ఆధారాలకోసం వెతుకున్నాను అనుకుంటుంది సత్య
మహదేవయ్య అందర్నీ హాల్లోకి పలుస్తాడు..తన ఎమ్మెల్యే టికెట్ రిస్క్ లో పడిందని..చనిపోయిన MLA కొడుకు రామచంద్ర తన టికెట్ కి అడ్డు వస్తున్నాడని వాడి సంగతి చూడమని చిన్నాకు చెబుతాడు
రుద్ర ఎందుకు పనికిరాడంటూ తెలివిగా ఆ పని క్రిష్ కి అప్పగిస్తాడు. సత్య అడ్డుపడితే..నువ్వు వెళ్లడం నీ పెళ్లానికి ఇష్టంలేదులేరా రుద్రని పంపిస్తా అంటాడు. కానీ క్రిష్ మాత్రం తానే వెళతానంటాడు...