Unstoppable With NBK - Ram Charan: 'అన్‌స్టాపబుల్ 4'కు రామ్ చరణ్.. అల్లు అర్జున్ ఇష్యూ పై ఎలా రియాక్టవుతాడు!
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే' సీజన్ 4లో సంక్రాంతి హీరోల సందడి సాగుతోంది. ఇప్పటికే వెంకీతో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. లేటెస్ట్ గా రామ్ చరణ్ ఎపిసోడ్ షూట్ జరిగింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగేమ్ ఛేంజర్ మూవీతో సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు రామ్ చరణ్.. ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. సేమ్ టైమ్ బాలయ్య షో లో సందడి చేశాడు
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే' షూటింగ్ కి అటెండ్ అయిన రామ్ చరణ్ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్
ఆల్రెడీ అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ రామ్ చరణ్ మాట్లాడుకున్నారు..నేరుగా కాదు..ప్రభాస్ ఎపిసోడ్ లో భాగంగా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ కొద్దిసేపు చాలా సరదాగా సాగింది. ఇప్పుడు నేరుగా బాలయ్య షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు చరణ్..
జనవరి 10న రిలీజ్ కాబోతోంది గేమ్ ఛేంజర్. ఈ సినిమా గురించి ఏం చెబుతాడు? మెగా vs అల్లు అని సాగుతున్న వివాదం గురించి ఏం మాట్లాడుతాడు? బన్నీ లేటెస్ట్ ఇష్యూ గురించి ఏమైనా రియాక్టవుతాడా? అనేది ఇంట్రెస్టింగ్..
చరణ్ మాత్రమే కాదు...బాలయ్య కూడా సంక్రాంతి హీరోనే. డాకు మహారాజ్ తో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇదే షోలో డాకూ మహరాజ్ గురించి చరణ్ సరదాగా మాట్లాడే ఛాన్సుంది..
అంటే రెండు సంక్రాంతి సినిమాలు డాకూ మహారాజ్, గేమ్ ఛేంజర్ ఈ రెండింటికి సంబంధించిన విషయాలపై డిస్కషన్ జరిగే అవకాశం ఉంది