Meenaakshi Chaudhary : మీనాక్షి చౌదరి 2024 రౌండప్.. పర్సనల్, ప్రొఫెషనల్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్
2024 ముగిసిపోతుంది.. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఈ సమయంలో సెలబ్రెటీలు తమ 2024 రౌండప్ అంటూ ఫోటోడంప్స్ని ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నారు. (Image Source : Instagram/Meenakshi Chaudhary)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా మీనాక్షి చౌదరి కూడా 2024 రౌండప్స్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో బెస్ట్ మెమోరీలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. (Image Source : Instagram/Meenakshi Chaudhary)
2024 ✨✨✨✨ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. తన పర్సనల్ ఫోటోలు, షూట్ ఫోటోలు షేర్ చేసింది మీనాక్షి. ఈ ఫోటోలు చూస్తే కచ్చితంగా అర్థమయ్యే విషయమేమిటంటే మీనాక్షి పెద్ద ఫుడ్డి అని. (Image Source : Instagram/Meenakshi Chaudhary)
సాధారణంగా హీరోయిన్లు బ్రౌనీలు, బర్గర్ల జోలికి వెళ్లరు. కానీ ఈ భామ ఫుడ్ విషయంలో చాలా తక్కువగా కాంప్రిమైజ్ అవుతుందట.(Image Source : Instagram/Meenakshi Chaudhary)
తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొని.. షూటింగ్ సమయంలో చాక్లెట్లు తింటూ ఉంటానని చెప్పింది ఈ బ్యూటీ. ఎంత తిన్నా.. ఇలా ఉండేందుకు కూడా బాగానే కష్టపడతానని చెప్పింది.(Image Source : Instagram/Meenakshi Chaudhary)
మీనాక్షి గుంటూరుకారం సినిమాతో ఈ సంవత్సరాన్ని ప్రారంభించింది కానీ.. దానిలో ఈమె పాత్ర చాలా చిన్నది. ఈ విషయంలో టాలీవుడ్ సినీ ప్రేక్షకులు చాలామంది డిజప్పాయింట్ అయ్యారు. (Image Source : Instagram/Meenakshi Chaudhary)
అయితే ఇయర్ ఎండ్ అయ్యేసరికి తన ఖాతాలో మంచి హిట్‌ని వేసుకుంది మీనాక్షి. లక్కీ భాస్కర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ అందుకుంది. (Image Source : Instagram/Meenakshi Chaudhary)
కానీ ఆ లక్ ఎక్కువకాలం కొనసాగలేదు. మెకానిక్ రాఖీ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. (Image Source : Instagram/Meenakshi Chaudhary)
ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో కలిపి అనగనగా ఒకరాజు సినిమా చేస్తోంది మీనాక్షి. నవీన్ సినిమాలు మినిమం గ్యారెంటీ కాబట్టి.. ఈ భామ ఖాతో మరో హిట్ లోడ్ అవుతుందనే చెప్పవచ్చు.(Image Source : Instagram/Meenakshi Chaudhary)