Vinayaka Chavithi 2024: యాంకర్స్ ఇళ్లలో వినాయక చవితి సందడి - ఎవరెలా పూజ చేశారో, ఎవరి ఇంట గణేశుడు ఎలా ఉన్నారో చూశారా?

తెలుగు సినిమా ప్రెస్మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసే జనాలకు యాంకర్, యాక్ట్రెస్ మంజూష తెలిసే ఉంటారు. ఆవిడ ఇంట మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. పూజ తర్వాత సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
బుల్లితెర స్టార్, యాంకర్ స్రవంతి చొక్కారపు సైతం మట్టి వినాయకుడికి ఓటు వేశారు. పట్టుచీర కట్టి, భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఫోటోలు దిగారు.

స్టార్ యాక్ట్రెస్, ఒకప్పటి యాంకర్ అనసూయ పూజ చేసిన ఫోటోలు షేర్ చేయలేదు. కానీ, పూజ తర్వాత ప్రసాదం తిన్న ఫోటోలు షేర్ చేశారు.
ఏపీ ఎన్నికల సమయంలో రాజకీయాల్లో బలంగా వినిపించిన యాంకర్ కమ్ యాక్ట్రెస్ పేరు శ్యామల. ఆవిడ ఈ వినాయక విగ్రహంతో ఫోటోలు దిగి షేర్ చేశారు.
వినాయక చవితి రోజున టీవీలో సందడి చేశారు శ్రీముఖి. స్టార్ మా ఛానల్ కోసం నిర్వహించిన 'గణపతి బప్పా మోరియా' ప్రోగ్రాం కోసం ఆవిడ ఈ డ్రస్ లో రెడీ అయ్యారు.
ఈటీవీలో ప్రసారమైన 'జై జై గణేశా' కార్యక్రమంలో యాంకర్ రష్మీ గౌతమ్ సందడి చేశారు.
రీతూ చౌదరి కర్ణాటకలోని మైసూరులో గల చాముండేశ్వరి ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించారు.