Apsara Rani: లంగా ఓణీలో అప్సరా రాణి... గ్లామర్ షో చేసే హీరోయిన్ సర్ప్రైజ్ చేసిందిగా
హీరోయిన్ అప్సరా రాణి (actress Apsara Rani) అంటే గ్లామర్ గర్ల్ అని ముద్ర పడింది. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఆవిడ చేసిన గ్లామర్ షో అటువంటిది. అయితే, ఇప్పుడు ఆ హీరోయిన్ ట్రెడిషనల్ డ్రస్సుల్లో సర్ప్రైజ్ చేశారు. అదీ లంగా వోణీల్లో! 'రాచరికం' సినిమాలో 'టిక్కు టిక్కు' పాటలో కొత్తగా కనిపించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅప్సరా రాణి ఓ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'రాచరికం'. విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ హీరోలుగా నటించారు. సురేష్ లంకలపల్లి రచన, దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మిస్తున్న చిత్రమిది.
'రాచరికం' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని దర్శక నిర్మాతలు తెలిపారు. సినిమాలో 'టిక్కు టిక్కు' పాటను తాజాగా విడుదల చేశారు.
'టిక్కు టిక్కు...' అంటూ హుషారుగా సాగే ఈ గీతంలో అప్సరా రాణి లంగా వోణీల్లో సందడి చేయగా... మంగ్లీ ఆలపించారు. ఈ పాటను పెంచల్ దాస్ రాశారు. జాతర నేపథ్యంలో పాటను తెరకెక్కించారు. వెంగీ సంగీతం అందించారు.
'రాచరికం' సినిమాలో 'హైపర్' ఆది, 'రంగస్థలం' మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన తారాగణం.