Deepika Padukone Ganesh Chaturthi 2024: సిద్ధి వినాయక ఆలయంలో దీప్ వీర్ జోడీ... డెలివరీకి ముందు గణేశుని ఆశీస్సులు తీసుకున్న దీపిక
వినాయక చవితి పండుగ వాతావరణం ప్రతి చోట నెలకొంది. హైదరాబాద్ తరహాలో ముంబై మహా నగరంలోనూ గణేష్ చతుర్థి బాగా చేస్తారు. అసలే ఫెస్టివల్ టైమ్, పైగా రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ రాకతో సిద్ధి వినాయక ఆలయం కిక్కిరిసిపోయింది.
ఈ నెలలో దీపికా పదుకోన్ డెలివరీ. నెలాఖరున ఆమె బిడ్డకు జన్మ ఇవ్వనున్నారు. తొమ్మిది నెలల గర్భంతో ఆవిడ ముంబై సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి ఆ గణేశుని ఆశీస్సులు తీసుకున్నారు.
ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం చాలా ఫేమస్. అక్కడ కోరుకున్నవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు ఆ ఆలయానికి వెళతారు. డెలివరీకి ముందు దీపికా పదుకోన్ వెళ్లారు. మరి, ఆవిడ ఏం కోరుకున్నారో?
విశేషం ఏమిటంటే... డెలివరీకి ముందు థియేటర్లలోకి వచ్చిన దీపికా పదుకోన్ సినిమా 'కల్కి 2898 ఏడీ'. అందులోనూ ఆమె గర్భవతిగా నటించారు.
సిద్ధి వినాయక ఆలయంలో దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ ఫోటోలు - వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.