Satyabhama Serial - Varalakshmi Vratham 2024: వరంగల్‌లో 'సత్యభామ' వరలక్ష్మి వ్రతం... తెలుగు సంస్కృతికి నివాళిగా, ప్రజల మధ్యలో
తెలుగింటి సంప్రదాయాలు, సంస్కృతి ఆచారాలకు ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇటీవల వరలక్ష్మి వ్రతం సందర్భంగా సూపర్ హిట్ సీరియల్ 'సత్యభామ' తారాగణాన్ని వరంగల్ తీసుకు వెళ్లింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరంగల్ ప్రజల దగ్గరకు 'సత్యభామ' హీరో హీరోయిన్లు నిరంజన్, ప్రేరణలను స్టార్ మా తీసుకు వెళ్లింది. ప్రజల మధ్య వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్బహించారు.
'సత్యభామ' సీరియల్ స్టార్ నిరంజన్ దరువు వేసి... వరలక్ష్మి వ్రతం చూడటానికి వచ్చిన ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. పంచెకట్టు, షర్టులో అచ్చమైన తెలుగు ఇంటి యువకుడిలా కనిపించారు.
'సత్యభామ' సీరియల్ క్యాస్ట్ తమ మొదటి వరలక్ష్మీ వ్రతాన్ని వరంగల్ ప్రజలతో కలిసి జరుపుకోవడంతో అక్కడి వారందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు 'సత్యభామ' తారల వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక సైతం వరంగల్‌లో జరిగింది.
వరలక్ష్మీ వ్రతం కార్యక్రమానికి భారీ సంఖ్యలో వరంగల్ ప్రజలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. భక్తి శ్రద్దలతో పవిత్రోత్సవాలు తిలకించారు. వరలక్ష్మి పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని నిర్వహించిన నిరంజన్, ప్రేరణ.
వరలక్ష్మీ వ్రతానికి హాజరైన మహిళలకు వాయనాలు అందించటంతో పాటుగా ప్రసాదాలు పంపిణీ చేసింది స్టార్ మా టీమ్. అయితే... 'సత్యభామ' హీరో వేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.
వరంగల్ వేదికగా జరిగిన 'సత్యభామ' సీరియల్ టీమ్ వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో తెలుగు సాంస్కృతిక సంపదను గుర్తు చేసేలా ప్రత్యేక తోలుబొమ్మలాట ప్రదర్శన నిర్వహించారు. తెలుగు సంస్కృతికి తాము ఇచ్చే నివాళి ఇది అని స్టార్ మా తెలిపింది.