Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 ప్రోమో హైలైట్స్... నాని కంటే అతనికే ఎక్కువ మార్కులు వేసిన ప్రియాంక, అసలు దొరకలేదుగా
'బిగ్ బాస్ 8 తెలుగు'తో కింగ్ నాగార్జున మరోసారి బుల్లితెర వీక్షకులకు వినోదం అందించడానికి రెడీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఇంటిలోకి కంటెస్టెంట్లను పంపిస్తామని చెప్పారు. లాంచ్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. మరి, అందులో హైలైట్స్ ఏంటో చూద్దామా?
Download ABP Live App and Watch All Latest Videos
View In App'సరిపోదా శనివారం' హీరో హీరోయిన్లు నాని, ప్రియాంక మోహన్ 'బిగ్ బాస్ 8' లాంచ్ ఎపిసోడ్‌కు అతిథులుగా వచ్చారు. హీరోగా నానికి ఎన్ని మార్కులు ఇస్తావ్ అని అడగ్గా వందకు వంద అని చెప్పింది ప్రియాంక మోహన్.
మరి, ఎస్.జె. సూర్య సంగతి ఏంటి? అని నాని, నాగార్జున అడిగారు. ప్రియాంక మోహన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆమె తెలివిగా '101' అని సమాధానం ఇచ్చింది. నాని కంటే సూర్యకు ఒక్క మార్కు ఎక్కువ వేసింది.
'35 ఇది చిన్న కథ కాదు' హీరోయిన్ నివేదా థామస్, ఆ సినిమా ప్రజెంటర్ రానా దగ్గుబాటి సైతం 'బిగ్ బాస్ 8' స్టేజి మీద సందడి చేశారు. ఇంటిలో ఉండాలని వాళ్లిద్దరినీ నాగార్జున కోరగా... తనను మూడు రోజులు, రానాను ఐదు రోజులు ఉంచమని సలహా ఇచ్చింది నివేదా. మూడో రోజుల్లో తనను ఎలిమినేట్ చేయమని కోరింది.
నాలుగు వారాలు హాలిడే కోసం వెళతానని, షో హోస్ట్ చేయాలని నానిని నాగార్జున అడగ్గా... 'ఆ ఒక్కటీ తప్ప ఇంకేమైనా చేస్తాన'ని చెప్పారు నాని. 'బిగ్ బాస్ తెలుగు' రెండో సీజన్ హోస్ట్ నానియే. ఆ తర్వాత హోస్ట్ చేయలేదు.
బిగ్ బాస్ ఇంటిలోకి నాని వెళ్లారు. అక్కడ అందరూ నవ్వుతూ కనిపించగా... ''నాకు మీ ఫ్యూచర్ కనబడుతోంది'' అని నాని అనడంతో అందరూ నవ్వేశారు.
దర్శకుడు అనిల్ రావిపూడి 'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్లారు. అక్కడ నుంచి ఒకరిని తాను బయటకు తీసుకు వెళ్లాలని, ఆ కంటెస్టెంట్ బదులు లక్కీ డ్రాలో మరొకరు లోపలికి వస్తారని అనిల్ రావిపూడి చెప్పారు.