Bhanumathi 10th March 1st Episode Highlights: కాబోయే మామని అరెస్ట్ చేయించిన 'భానుమతి' - మార్చి 10 మొదటి ఎపిసోడ్ హైలెట్స్!
మార్చి 10 సాయంత్రం 6 గంటలకు భానుమతి మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానుంది. సత్యభామ సీరియల్ ప్లేస్ లో వస్తోన్న భానుమతి కూడా అంతకుమించిన ఆత్మవిశ్వాసంతో సాగిపోనున్నట్టే అర్థమవుతోంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసత్యభామ సీరియల్ మొత్తానికి ప్రాణం సత్య క్యారెక్టర్లో నటించిన ఆమెదే. ఆత్మవిశ్వాసం, తనపై తనకు విశ్వాసం, తప్పుచేయని నైజం , ముక్కుసూటితనం ఇవన్నీ సత్యభామ సీరియల్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించాయి. ఇప్పుడు భానుమతి కూడా అలానే ఉండబోతోందని ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది
డాక్టర్ కావాలి అని కలలు కన్న అమ్మాయి మైనార్టీ తీరకముందే పెళ్లిచేయాలి అనుకుంటారు. ఆ విషయం నేరుగా పోలీసులకు కాల్ చేసి చెప్పి పెళ్లి ఆగిపోయేలా చేస్తుంది భానుమతి
గుప్పెడంతమనసు తర్వాత సాయికిరణ్ హీరో తండ్రిగా నటిస్తున్నాడు..తనని పోలీసులు తీసుకెళ్లిపోతారు. భానుమతికి మైనార్టీ తీరిన తర్వాత పెళ్లిచేసుకుంటా అంటాడు హీరో...
కాలేజీలో దించేందుకు వెళ్లిన హీరోకి..తన తండ్రి అరెస్టుకి భానుమతే అని తెలుస్తుంది..అప్పుడు కథ ఎలాంటి మలుపులు తిరగబోతోంది అన్నదే చూడాలి...
మనం ఎగరాలని బలంగా అనుకుంటే చాలు రెక్కలు వాటంతట అవే వస్తాయంటూ భానుమతిని పరిచయం చేశారు. డాక్టర్ కావాలన్న తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భానుమతి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొందన్నదే ప్రధాన కథ..