Satyabhama Today October 18th Episode Highlights: రేణుక సేఫ్..మహదేవయ్యకి షాక్ ఇచ్చిన సత్య - సత్యభామ అక్టోబరు 18 ఎపిసోడ్ హైలెట్స్!
ముత్తైదువులకు వాయనం ఇద్దామని సత్య అంటే..కడుపులో నొప్పి అని చెప్పి వెళ్లిపోతుంది రేణుక. ఇంటర్నల్ గా ఏదైనా ప్రాబ్లెమ్ ఉందేమో చెక్ చేయాలి అంటుంది డాక్టర్. అంతా హడావుడిగా ఉన్నారు నేను ఒక్కదాన్ని హాస్పిటల్ కి వెళ్లొస్తా అనుకుంటుంది..ఇదే అవకాశం అనుకుంటాడు రుద్ర.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమోవైపు ఇంటికొచ్చి చూసేసరికి మైత్రి ఆరోగ్యం బాలేనట్టు నటిస్తుంటుంది. అది చూసి నందిని ఫైర్ అవుతుంది. ఎప్పటిలా హర్ష..నందినికి క్లాస్ వేస్తాడు. పోక పోక నేను పుట్టింటికి వెళితే మాకెందుకు కాల్ చేయాలి..అత్తమ్మ వాళ్లకి కాల్ చేస్తే సరిపోయేది కదా అంటుంది.
లేనిపోని ఆరాటం చేతికాని పోరాటం ఎందుకు..లేడిపిల్ల లేడిపిల్ల లెక్కుంటే బావుంటుందని సత్యను ఉద్దేశించి అంటాడు. నీ ముందున్నది మహదేవయ్య కాదు మనిషి రూపంలో ఉన్న రావణుడు అంటాడు. చనిపోయిన మనిషిని ఒకేసారి దహనం చేస్తారు అహంకారంలో చావుని కొనితెచ్చుకున్న రావణుడిని కసితీరా దహనం చేస్తారు..రావణుడి లాంటివారికి ఇదే గతి పడుతుందని పంచ్ వేస్తుంది సత్య.
భైరవి, క్రిష్, జయమ్మ వస్తారు.. ఏం చేస్తున్నారు మామా కోడలు అంటే.. రామాయణం చెబుతోంది వింటున్న అని సెటైర్ వేస్తాడు మహదేవయ్య..
రేణుక హాస్పిటల్ కి వెళుతుంటే రౌడీలతో కిడ్నాప్ చేయించి తీసుకొచ్చి రావణుడి బొమ్మ వెనుక కట్టేస్తాడు రుద్ర. సత్య కాల్ చేస్తుంటే రేణుక ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది..డాక్టర్ కి కాల్ చేస్తే రేణుక ఇంకా రాలేదంటుంది. తను హాస్పిటల్ కి వెళుతోందిలే అనుకుంటారంతా..
ఏటా రావణుడికి బాణం వేసేది నువ్వే కదా మొదలుపెట్టు అని భైరవి అంటే.. ఈసారి చిన్నకోడలికి ఛాన్స్ ఇద్దాం అంటాడు మహదేవయ్య. క్రిష్ - భైరవి ఇద్దరూ వద్దంటారు.. ఈసారి ఛాన్స్ రుద్రకు ఇద్దాం అంటారు..
రుద్ర వేసిన మొదటి బాణం మిస్సవడంతో..మీపై చాలా ఆసలు పెట్టుకున్నారు మావయ్యగారు.. ఇలా చేస్తే ఎలా అంటుంది.. అప్పుడు క్రిష్ - సత్య బాణం వేస్తారు.. నిప్పంటుకుంటుంది
రావణ దహనం జరుగుతుండగా అక్కడ రేణుక ఉన్నట్టు గుర్తిస్తుంది సత్య.. వెంటనే క్రిష్ ఆమెను కాపాడతాడు.. పనోడిని బెదిరిస్తే ఇదంతా రుద్ర చేయించారని చెబుతాడు.. క్రిష్ - మహదేవయ్య మధ్య మళ్లీ మాటల యుద్ధం జరుగుతుంది