✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial Today October 18th Highlights : కావ్య - రాజ్ ఒంటరి ప్రయాణం.. చెంప పగిలినా బుద్దిపోనిచ్చుకోని రుద్రాణి!

RAMA   |  18 Oct 2024 09:12 AM (IST)
1

దాంపత్య వ్రతంలో కూర్చున్న జంటల ఆనందంపై ఆవిరి చేసింది. కనకం క్యాన్సర్ నాటకం బయటపెట్టేసింది. పెళ్లి అప్పుడు కూతురుకి ముసుగు వేసింది ఇప్పుడు ఇంట్లో అందరకీ ముసుగువేసిందని ఆడేసుకుంటుంది. ఇందిరాదేవి, అపర్ణ, కనకం ఎంత వారించినా రుద్రాణి తగ్గదు. కావ్య-రాజ్ నిలదీసినా కానీ రుద్రాణి రివర్సవుతుంది. నిజం కాకపోతే చెప్పమనండి అని కనకం వైపు చూపిస్తుంది..

2

రాజ్ నిలదీయడంతో..అదంతా నిజమే అంటుంది కనకం. ఇంతమందిలో దోషిగా నిలబడి ఏం సాధించావే అని కనకం భర్త కృష్ణమూర్తి కోప్పడతాడు. కనకం డ్రామా కంపెనీ పెట్టుకో..ముగ్గురు కూతుర్లను హీరోయిన్లుగా పెట్టుకో..తాళం ఆడించడానికి మీ ఆయన ఉన్నాడు కదా అని చెలరేగిపోతుంది రుద్రాణి

3

ఇందులో ఎలాంటి స్వార్థం లేదని కనకం చెప్పేందుకు ప్రయత్నించినా రాజ్ వినడు. నన్ను ఫూల్ ని చేశారు..మీ కూతురికి అయినా బుద్ధి లేదా అని కావ్యను టార్గెట్ చేస్తాడు. ఆ పెంపకమే అలాంటిదంటాడు. ఇంత నాటకం ఆడి మమ్మల్ని కలిపావు అనుకుంటున్నావా..ఎందుకీ బతుకులు..నేను మీకు భారమయ్యానా? నన్ను వదిలించుకోవాలి అనుకుంటుననావా? అప్పుడు ముసుగువేశావ్..ఇప్పుడు ఇంకెవరు నమ్ముతారు అని నిలదీస్తుంది.

4

ఈ నాటకం ఆడించిందే నేను అని అపర్ణ చెప్పడంతో..అందరూ షాక్ అవుతారు. నేను కూడా అని ఇందిరాదేవి చెబుతుంది. ఇందులో కనకం - కావ్య కు ఎలాంంటి సంబంధం లేదంటుంది. వీళ్లతో కూడి మీరు కూడా ఇలానే తయారయ్యారా అని ఫైర్ అవుతారు. జీవితంలో ఈ కుటుంబాన్ని నేను క్షమించను అనేసి కోపంగా వెళ్లిపోతాడు

5

సంతోషిస్తున్న రుద్రాణిని...ఇందిరాదేవి లాగిపెట్టి కొడుతుంది. నువ్వు ఆడదానివేనా? విడిపోయిన భార్య-భర్తను కలిపేందుకు చిన్న ప్రయత్నం చేస్తుంటే జీవితంలో కలవకుండా చేశావ్.. ఇన్నాళ్లు పాముకి పాలుపోసి పెంచినందుకు సిగ్గుపడుతున్నా అంటుంది ఇందిరాదేవి. ఈ పాపం ఊరికేపోదు..సర్వనాశనం అయిపోతావ్ అంటుంది

6

తప్పు చేసిన వాళ్లని వదిలేసి నన్ను అనగానే... చేయెత్తిన అపర్ణ ఇంటి ఆడపడుచువి అయిపోయావ్ నువ్వు చేసిన దానికి ప్రాణం తీసేదాన్ని అరేయ్ రాహుల్ మీ అమ్మను తీసుకెళ్లు అంటుంది అపర్ణ. కావ్య మీ అమ్మను ఏమీ అనొద్దు..కూతురు కాపురం నిలబెట్టడం కోసం తల్లడిల్లిపోయే తన బాధను అర్థం చేసుకో అంటుంది. నాకు చెప్పే హక్కు మీరిద్దరూ పోగొట్టుకున్నారు..నేను ఎవర్నీ నమ్మకు అనేస్తాడు రాజ్.

7

బ్రహ్మముడి అక్టోబరు 19 ఎపిసోడ్ లో...నేను ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్నా అని క్లారిటీ ఇచ్చేస్తాడు రాజ్. మేం జీవితంలో కలుస్తాం అనే నమ్మకం లేదంటుంది కావ్య...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial Today October 18th Highlights : కావ్య - రాజ్ ఒంటరి ప్రయాణం.. చెంప పగిలినా బుద్దిపోనిచ్చుకోని రుద్రాణి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.