Satyabhama Serial February 28th Episode Highlights: శివగామి - మహదేవయ్య సేమ్ టు సేమ్.. బాహుబలి(క్రిష్)ని గెంటేసి భళ్లాలదేవ(సంజయ్)కి కిరీటం పెట్టారు - సత్యభామ ఫిబ్రవరి 28 ఎపిసోడ్ హైలెట్స్!
సత్యభామ ఫిబ్రవరి 28 ఎపిసోడ్ లో...క్రిష్ తాగుతూ తూలుతూ ఉంటాడు. ఏదో ఓ రోజు బాపు నాకోసం వస్తాడు, నన్ను చూడకుండా ఉండలేడు అంటాడు. మహదేవయ్య ఇంటికి వెళ్లిన సత్య...క్రిష్ ని ఇదివరకట్లా ప్రేమగా పిలవండి అంటుంది. అలా జరగాలంటే నువ్వు తన జీవితంలోంచి వెళ్లిపోవాలనే కండిషన్ పెడుతుంది భైరవి...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరుద్రని అరెస్ట్ చేసిన తర్వాత ఆ పోలీస్ సంజయ్ కి కాల్ చేసి మీరు చెప్పినట్టే చేశాను అంటాడు. వాడు జీవితాంతం జైల్లోనే ఉండాలి ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆస్తి మొత్తం అన్నయ్యపేరుమీద పెట్టారు..మరి నా సంగతేంటి..అందుకే ఇలా చేస్తే ఆస్తి మొత్తం నెమ్మదిగా ట్రాన్ఫర్ చేయించుకుంటా అనుకుంటాడు
క్రిష్ గురించి సత్య వెతుకుతుంటుంది..ఇంతలో తల్లి, నందిని ఇద్దరూ వస్తారు. ఏం జరిగిందో చెప్పాలికదా..ఒక్కదానివే ఎన్నాళ్లు బాధను మోస్తావ్ అని అడుగుతారు. జరిగినదానికి నాకు బాధగా లేదు జరిగిన పద్ధతే బాధగా అనిపించింది అంటుంది
మా బాపు మత్తు అన్నకి బాగా ఎక్కిందని నందిని అంటుంది. నేను ఊహించినదానికన్నా ఎక్కువ బాపు ప్రేమలో ఉన్నాడు అంటుంది సత్య. ఈ నిజం ఇంకా క్రిష్ ఒప్పుకోలేకపోతున్నాని బాధపడుతుంది
క్రిష్ చీకట్లో రోడ్డు మీద కూర్చుని బాపు బాపు అంటూ తలుచుకుని ఏడుస్తాడు.
మహదేవయ్య సిగరెట్ తాగుతూ కూర్చుంటే సంజయ్ వస్తాడు.. రేయ్ చిన్నా నిన్ను ఇంట్లోంచి తరిమేసినా నీ ఆలోచనల నుంచి తప్పించలేకపోతున్నా, రుద్రని జైలుకి తరిమేశా..ఇక నా టార్గెట్ నువ్వే అనుకుంటూ మహదేవయ్య కాళ్లదగ్గర కూర్చుంటాడు.
ఇంతలో భైరవి ఏడుస్తూ వచ్చి రుద్ర అరెస్ట్ అయిన విషయం చెబుతుంది. ఇంత జరుగుతుంటే ఆ చిన్నా ఏం చేస్తున్నాడు వాడిని పిలు వాడైతే సెటిల్ చేస్తాడు అంటాడు. పెళ్లాం కొంగుపట్టుకుని వెళ్లిపోయాడంటూ సెటైర్ వేస్తుంది భైరవి
నేను వెళ్లి వాడి కాళ్లు పట్టుకుని ఇంటికి తీసుకొస్తా అంటాడు సంజయ్. భైరవి అవసరం లేదంటుంది. నేను చూసుకుంటా రుద్ర సంగతి అంటాడు మహదేవయ్య.
చిన్నా విలువ ఇప్పుడు తెలుస్తోందా అంటుంది జయమ్మ. నా కొడుకులు అని విర్రవీగావు..ఒకడు జైల్లో, మరొకడు భయంతో ఇంట్లో.. ఇప్పటికైనా పోగొట్టుకున్నది తెలుసుకో బాగుపడతావ్ అంటుంది
నా కొడుకుని ఎవరు బయటకు తీసుకొస్తారో అని భైరవి బాధపడుతుంటే..నీ కొడుకు బయటకొచ్చి ఎవర్నీ ఉద్ధరించాల్సిన అవసరం లేదు అత్తమ్మా అంటుంది రేణుక. ఎవరైనా విడిపించుకుని వస్తే మళ్లీ నేను జైల్లో పెట్టిస్తా అంటుంది. రేణుక రియాక్షన్ కి భైరవి బిత్తరపోతుంది
సత్యభామ మార్చి 01 ఎపిసోడ్ లో...మహదేవయ్య దగ్గరకు వెళ్లిన సత్య.. క్రిష్ తో ఇదివరకట్లా ఉండండి అంటుంది. అది జరగాలి అంటే నువ్వు క్ిష్ జీవితంలోంచి వెళ్లిపోవాలనే కండిషన్ పెడుతుంది భైరవి