Satyabhama Serial Today January 7th Highlights: మహదేవయ్య ఇంట్లో ముసలం.. భైరవికి షాక్ ఇచ్చిన జయమ్మ - సత్యభామ జనవరి 7 ఎపిసోడ్ హైలెట్స్!
సత్య డల్‌గా ఉంటే ఏమైందని అడుగుతాడు క్రిష్. చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరంటుంది సత్య..అదేం లేదులే చెప్పు అంటాడు క్రిష్. పుట్టింట్లో ఏం జరిగిందో చెబుతుంది సత్య.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరుద్ర భోజనం చేస్తుంటే రేణుక పక్కనే నిల్చుని ఉంటుంది. రుద్ర రేణుక జుట్టు పట్టుకుని సత్యను చూసి రెచ్చిపోతున్నావ్ నేను వచ్చినా కుక్కిన పేనులా పడి ఉండు లేదంటే అయిపోతావ్ అని బెదిరిస్తాడు
ఇవాళ మనింట్లో జాతరరా..పోయి అన్ని పనులు చేసుకో అంటాడు. భైరవిని పిలిచి చేయాల్సిన వంటల గురించి చెబుతాడు. ఇవన్నీ పెద్దోడికి ఇష్టం వాడు లేకుండా ఇవేమీ ఇంట్లో వండకూడదు అంటుంది భైరవి. క్యారేజీ కట్టు నేను పోయి ఇచ్చి వస్తా అంటాడు క్రిష్. ఇంతలో రుద్ర దిగుతాడు
మా బాపు అమ్మ ముఖంలో తప్ప ఎవరి ముఖంలోనూ సంతోషం లేదంటాడు రుద్ర. తప్పు చేశావ్ జైలుకి పంపాను ఇకనైనా నువ్వు మంచిగా ఉంటే అంతే చాలు అన్నా అంటాడు క్రిష్. బాపూ నువ్వు రాంగ్ టైమ్ లో అన్నను తీసుకొచ్చావ్ అంటాడు.
అంటే ఏంట్రా నన్ను జైలులో ఉండమంటావా అంటూ ఫైర్ అవుతాడు.నీ ఆవేశం అంటే నాకిష్టం అందుకే నిన్ను తీసుకొచ్చా.. చిన్నోడు నా కుడిభుజం, నువ్వు నా ఎడమ భుజం అంటాడు. మామయ్య ఏదో పెద్ద ప్లానే చేశాడు అనుకుంటుంది రేణుక
నందిని ఎంట్రీ ఇచ్చి రుద్రని చూసి సెటైర్స్ వేస్తుంది. రుద్ర ఫైర్ అవుతుంటే..నువ్వు మహదేవయ్య కొడుకువి అయితే నేను కూతుర్ని సేమ్ బ్లడ్ అంటుంది నందిని. వదినా రా...నామినేషన్ సంతకాల కోసం నా దోస్తులను అడుగుదాం అంటుంది.
సత్య, నందిని నామినేషన్లో సంతకాలం కోసం వెళ్లి చాలామందిని అడుగుతారు కానీ ఎవ్వరూ సంతకం చేసే ధైర్యం చేయరు..
నందిని, సత్య ఇద్దరూ తిరుగుతుంటే నర్సింహం వస్తాడు. సత్య-నర్సిహం మాట్లాడుకోవడం క్రిష్ చూస్తాడు. నీకు సపోర్ట్ గా నేను సంతకాలు చేయిస్తా అంటాడు నర్సింహ..
సత్యభామ జనవరి 08 ఎపిసోడ్ లో... సత్యకి నందిని తప్ప ఇంకెవరు సంతకం పెట్టరు..అతే జరిగితే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా అంటుంది భైరవి. అయితే ఇదిగో కొట్టుకో అంటూ జయమ్మ చెప్పు తెచ్చి ఇస్తుంది. సత్య నామినేషన్ పై నేను సంతకం పెడతా అంటుంది... మహదేవయ్య షాక్ అవుతాడు