Varun Sandesh: 'కానిస్టేబుల్' నిర్మాత తల్లి మరణించిన రోజే టీజర్ విడుదల - వరుణ్ సందేశ్‌కు హిట్ రావాలని
వరుణ్ సందేశ్ విజయం కోసం మరో ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల 'నింద'తో డీసెంట్ రెస్పాన్స్ అందుకున్న ఆయన... మరో కొత్త ప్రయత్నంతో వస్తున్నారు. ఈ మధ్య క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ సినిమాల పట్ల ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వరుణ్ అటువంటి సినిమా చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరుణ్ సందేశ్ కథానాయకుడిగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ సంస్థలో 'బలగం' జగదీష్ నిర్మిస్తున్న సినిమా 'కానిస్టేబుల్'. ఈ సినిమాతో మధులిక వారణాసి కథానాయికగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు.
''మా సినిమా టీజర్ విడుదల చేసిన త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. నాపై నమ్మకంతో అవకాశమిచ్చిన వరుణ్ సందేశ్, బలగం జగదీష్ గారికి థాంక్స్'' అని దర్శకుడు ఆర్యన్ సుభాన్ అన్నారు. నిర్మాత 'బలగం' జగదీష్ మాట్లాడుతూ... '' మా అమ్మ గారు చనిపోయిన రోజున ఈ సినిమా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. మేం అడగ్గానే టీజర్ విడుదల చేసిన త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. మా హీరో వరుణ్ సందేశ్‌కు 'కానిస్టేబుల్' కమ్ బ్యాక్ అవుతుందని నాకు నమ్మకం ఉంది'' అని చెప్పారు.
అతి దారుణంగా హత్యకు గురైన అమ్మాయి కేసును ఛేదించే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ నటించారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. నాలుగు భాషల్లో టీజర్ విడుదల చేశారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చేలా సినిమా ఉంటుందని టీజర్ చూశాక అర్థం అవుతోంది. త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ... ''టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. వరుణ్ సందేశ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారు. ఇది సక్సెస్ కావాలి. వరుణ్ సందేశ్‌కు మంచి పేరు రావాలి. దర్శక, నిర్మాతలకు డబ్బుతో పాటు పేరు రావాలి'' అని అన్నారు.
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన ఈ సినిమాలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, 'బలగం' జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: జాగృతి మూవీ మేకర్స్, నిర్మాత: 'బలగం' జగదీష్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్.కె, సహ నిర్మాత: బి నికితా జగదీష్ - కుపేంద్ర పవర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మిట్టపల్లి జగ్గయ్య - సీహెచ్ రాజ్ కుమార్, ఛాయాగ్రహణం: హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, కూర్పు: వర ప్రసాద్, నేపథ్య సంగీతం: గ్యాని, కళా దర్శకత్వం: వి. నాని - పండు, మాటలు: శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు - శ్రీనివాస్ తేజ.