Satyabhama Serial Today January 4th Highlights: బొమ్మ - బొరుసు వేసిన క్రిష్ అడుగులు తండ్రి వైపా - సత్య వైపా.. సత్యభామ జనవరి 4 ఎపిసోడ్ హైలెట్స్!
సత్యను కాపాడుకునేందుకు ఎవ్వరూ నామినేషన్ పేపర్లపై సంతకాలు చేయొద్దంటుంది విశాలాక్షి. ఎన్నికల్లో నిలబడి అది దేశాన్ని ఉద్ధరించాలా? దాని కాపురం అది తిన్నగా చేసుకుంటే చాలు అంటుంది. సంధ్య కూడా ఇదే అవకాశంగా రెచ్చిపోతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసత్యకు ఎవరు సపోర్ట్ చేసినా నాపై ఒట్టు అని అందర్నీ కట్టిపడేస్తుంది విశాలాక్షి. నన్ను మీరు పరాయి మనిషి అనుకున్నా పర్వాలేదు..సపోర్ట్ చేస్తానని ఇప్పటికే వదినకు మాటిచ్చాను ఆ మాట వెనక్కు తీసుకోలేను అంటుంది నందిని
మీ దిక్కు కాకుండా సత్యమ్మ వైపు ఎవరు నిలబడతారు అయ్యా అంటూ పనివాడు ఎగతాళిగా నవ్వుతాడు. అది చూసి లాగిపెట్టి కొడతాడు క్రిష్. సత్యకు ఉన్న తెలివి ఇంట్లో ఎవరికీ లేదు రాసిపెట్టుకో అంటాడు..మన ఇంటి మనిషి గురించి బయటివాళ్ల ముందు మాట్లాడడం సరికాదు బాపూ అంటాడు క్రిష్..
నేను మా పుట్టింటికి వెళుతున్నా ఓ గంటలో వచ్చేస్తాను అంటుంది. దింపి రమ్మంటావా అంటే..నావల్ల ఇప్పటికే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నావ్ నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదని థ్యాంక్స్ చెబుతుంది
పుట్టింటికి వెళ్లిన సత్య నామినేషన్ పేపర్లపై సంతకం చేయమంటుంది..ముందు మీ ఆయనతో ఓకే చెప్పించుకుని రా అంటుంది విశాలాక్షి. సంధ్య కూడా సత్యపై ఫైర్ అవుతుంది. ఇంట్లో ఎవరూ నీకు సపోర్ట్ చేయరంటుంది విశాలాక్షి.
నేను నీ చేయి విడిచిపెడితే దాని వెనుక పోతావా అని అనేసి..సరదాగా అన్నా అని కవర్ చేస్తాడు మహదేవయ్య. నువ్వు నా చేయి వదిలినా నేను వదలను బాపూ అంటాడు. సత్య ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్లకు ఇస్తోందంటాడు.
నువ్వు సమస్య పెద్దది చేస్తున్నావ్ అంటూ భైరవిని కంట్రోల్ చేస్తుంది జయమ్మ. నా మొగుడు నా గురించి ఎప్పుడూ సోచాయించలే. మా బంధం, నా ప్రాణం గురించి పట్టించుకోలేదు..చిన్నా మంచి మొగుడులా ఆలోచిస్తున్నాడు వాళ్ల బతుకు నా బతుకులెక్క కాకూడదు అంటుంది పెద్దకోడలు.
నేను మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవడం లేదు కానీ మీరు నన్ను వదులుకుంటున్నారు..ఒంటరిగానే పోరాటం చేస్తానంటుంది సత్య. తనని దీవించమని తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరిస్తుంది. ఇన్నాళ్లూ పుట్టిల్లు ఉందనే ధైర్యం ఉండేది ఇప్పుడు ఆ ధైర్యాన్ని వదిలేసి వెళ్తున్నా అని ఏడుస్తూ వెళ్లిపోతుంది.
సత్యభామ జనవరి 06 సోమవారం ఎపిసోడ్ లో... సత్య పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడుతాడు మహదేవయ్య. మరోవైపు నీ తండ్రిపై ప్రేమ ఉంది మరి వదినపట్ల బాధ్యత లేదా అని క్రిష్ ని స్నేహితులు అడుగుతారు.. బొమ్మ-బొరుసు వేస్తాడు క్రిష్...