Brahmamudi January 4th Episode: అందరి శత్రువులా మారిన కావ్య.. అనామిక కుట్రకు బలికాబోతున్న రాజ్ కావ్య - బ్రహ్మముడి జనవరి 4 ఎపిసోడ్ హైలెట్స్!
ఇంటికి చేరుకున్న కావ్యపై ఫైర్ అవుతారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. మీరు ఎలాగైనా ఊరేగండి ఇంట్లో అవసరాల కోసం కారు ఉండాలా వద్దా అని నిలదీస్తారు. మేం ఓ కారు తీసుకెళ్లాం..ఇంట్లోవాళ్లకోసం ఓ కారు ఉంచా కదా అంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేను నా భర్త ముందే కార్లు వెనక్కు పంపించాను. మీరు ఇష్టం వచ్చినట్టు లక్షలు ఖర్చుచేస్తున్నారు అందుకే ఇలా చేస్తున్నా. తాతయ్య గారు నాకు సర్వాధికారాలు ఇచ్చారంటుంది. ఆస్తిని కాపాడమని తాతయ్య నా చేతిలో పెట్టారు..విచ్చలవిడిగా ఖర్చు చేస్తానంటే ఇచ్చేందుకు సిద్ధంగా లేనంటుంది
నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే అని కావ్య కోపంగా వెళ్లిపోతుంది. ఇందతా విన్న ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. నువ్వేం మాట్లాడవేంటి రాజ్ అని ప్రకాశ్ నిలదీస్తాడు. నా ప్యాకెట్ మనీకోసం కూడా కళావతినే అడుగుతున్నా నేను ఎవరికి చెప్పుకోవాలి అనేసి వెళ్లిపోతాడు. కావ్య పద్ధతి బాలేదంటాడు ప్రకాశం..అపర్ణ సుభాష్ ఆలోచలో పడతారు.
రూమ్ లో డల్ గా కూర్చున్న రాజ్ ని ఎందుకలా ఉన్నారని క్వశ్చన్ చేస్తుంది. అందరనీ ఒకటిగా ఉంచాలనే తాతయ్య సంకల్పం మాయమైపోతోంది బాధపడతాడు. ఇంటికి జబ్బు చేసింది..నేను వైద్యం చేస్తున్నాను..అందుకే వాళ్లకి నా ప్రవర్తన నచ్చడం లేదంటుంది కావ్య..
ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్ ముగ్గురూ కావ్య ప్రవర్తన గురించి మాట్లాడుకుంటారు. కావ్య బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తోంది కానీ కొన్ని విషయాల్లో మరీ కఠినంగా ఉంటోంది అంటాడు సుభాష్.
అసలే అవకాశం ఎదురుచూస్తున్నారు..ఇప్పుడు ప్రకాశ్ ని కూడా చెడగొడుతున్నారని సుభాష్ అంటే..ప్రకాష్ అర్థం చేసుకుంటాడని అపర్ణ అంటుంది. ఓసారి కావ్యతో మాట్లాడాలి అనుకుంటారు
సారీ మేడం అని నందగోపాల్ అంటే..ఆరు నెలలు ప్లాన్ చేసి వంద కోట్ల ఆస్తి నీకు వచ్చేలా చేసి మూడు నెలలు అజ్ఞాతంలో ఉండమని చెబితే నీకు ఇప్పుడు అమ్మాయి కావాల్సి వచ్చిందా అని ఫైర్ అవుతుంది. మేం చెప్పింది చేయకపోతే నిన్న జైలుకి పంపిస్తాం అని బెదిరిస్తుంది.
కావ్య అర్థరాత్రి కూర్చుని డిజైన్లు గీస్తుంటుంది..రాజ్ వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. కావ్య వేసిన డిజైన్లు చూసి మెచ్చుకుంటాడు..
కావ్య రాజ్ ఆఫీసుకి వెళుతుంటే..టిఫిన్ తినేందుకు పిలుస్తుంది అపర్ణ.. రాజ్ తో మాట్లాడాలని సుభాష్ పిలుస్తాడు కానీ ఇద్దరూ అర్జెంటుగా వెళ్లాలంటూ ఇద్దరూ టిఫిన్ తినకుండా వెళ్లిపోతారు.
రాజ్ , కావ్య ఇద్దరూ ఆఫీసులో దేవుడి కోసం చేయించిన నగలు పరిశీలిస్తారు..ఆ తర్వాత అలసిపోయి ఇంటికి చేరుకుంటారు.. రాత్రి భోజనానికి రమ్మంటే..లంచ్ చేయకుండా ఈవెనింగ్ భోజనం చేశాం ఇప్పుడు ఆకలి లేదంటారు.
బ్రహ్మముడి జనవరి 6 సోమవారం ఎపిసోడ్ లో.. కావ్య మేనేజర్ నుంచి సెక్యూరిటీగా మార్చేసిన వ్యక్తికి కాల్ చేస్తుంది అనామిక. అక్కడ ఒరిజనల్ కిరీటం స్థానంలో డూప్లికేట్ ది పెట్టాలి నీకు 50 లక్షలు ఇస్తానంటుంది... సరే అంటాడు సెక్యూరిటీగా మారిన మేనేజర్...