Satyabhama Serial Today January 2nd Highlights: నరసింహ అవతారమెత్తుతా అన్న సత్య..కాల్చి పడేసిన మహదేవయ్య - సత్యభామ జనవరి 2 ఎపిసోడ్ హైలెట్స్!
మహదేవయ్య కాల్ చేసిన తర్వాత విశ్వనాథంలో టెన్షన్ పెరుగుతుంది. ఆ రాక్షసుడి నుంచి సత్యను కాపాడేది ఎవరు అని విశాలాక్షితో చెప్పి బాధపడతాడు. ఆ మాటలు విన్న నందిని...వదినను నేను కాపాడుతా మావయ్య..అండగా నిల్చుంటా అనుకుంటూ అక్కడి నుంచి వెళుతుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రిష్ ని రూమ్ లోకి పిలిచి..ఇండిపెండెంట్ గా పోటీచేయాలంటే పదిమంది సపోర్ట్ చేయాలా నిజమా అని అడుగుతుంది. క్రిష్ ఎద్దేవా చేస్తాడు. ఏమీ తెలియకుండా పోటీకి దిగావా అని కామెంట్ చేస్తాడు. మద్దతుగా తాను సంతకం చేయను అంటాడు. ఇప్పటికైనా MLA గా పోటీచేయాలన్న ఆలోచన విరమించుకో అంటాడు
కోపంగా ఇంటికెళ్లిన నందినిని లోపలకు రమ్మంటాడు మహదేవయ్య. లోపలకు రాను నేను తేల్చుకునేందుకు వచ్చానంటుంది. తప్పు మీద తప్పు చేశావ్ బాపూ..ఇంటి అల్లుడిని బద్నాం చేశావ్ ...మా అత్త మామల్ని అవమానించావ్..మా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు నువ్వు పంపిన వ్యక్తే నాకు నిజం చెప్పాడంటుంది
భైరవి ఫైర్ అవుతుంది..నీకు నీ పెనిమిటికి ఏం చేతనవును అని రివర్సవుతుంది నందిని. మొత్తం మీ బాపూ చేస్తే మీ బాపూనే అప్పు ఎందుకు తీరుస్తాడని భైరవ్ అంటే...క్రిష్ సపోర్ట్ చేస్తాడు. ఆ శేషుగాడిని అడిగితే నిజం తెలుస్తుంది అంటాడు.. చిన్నా నువ్వెళ్లి శేషుగాడిని తీసుకురా అంటాడు
శేషుని తీసుకొస్తాడు శేషు..నిన్న నాకు చెప్పిన విషయం అందరి ముందూ చెప్పు అంటుంది నందిని. మీరు ఏం అడుగుతున్నారో అర్థంకావడం లేదు మనం మామూలుగా మాట్లాడుకున్నాం కదా అని మాట మార్చేస్తాడు. శేషుని కూడా కొనేశారని నందిని ఫైర్ అవుతుంది. నందినిని పొమ్మని బెదిరిస్తుంది భైరవి
నందినికి సపోర్ట్‌గా నిలబడతా ఏం చేస్తావో చేసుకో అని సవాల్ చేస్తుంది నందిని. అంతా లోపలకు వెళ్లిపోతారు..సత్య నందిని వెనుకే వెళుతుంది. మీ బాపూ చాలా నేరాలు చేశాడుఅవన్నీ త్వరలోనే తెలుస్తాయంటుంది నందిని.
తనను త్వరలో ఈ ఇంటినుంచి గెంటేస్తారని అంటుంది సత్య. అదే జరిగితే నేను మా బాపూని రోడ్డుకి ఈడ్చుతా అంటుంది నందిని.
సత్యపై ద్వేషం పెంచేందుకు సంజయ్ సంధ్యకి మరింత నూరిపోస్తాడు. మీ అక్క ఇంట్లో అందరితో గొడవ పడుతోంది..ఆ ఎఫెక్ట్ మనపై పడుతుందంటాడు.
మీ అక్క ఎఫెక్ట్ తో నందిని మారిపోయింది..తండ్రినే ఎదిరిస్తోంది..నీపై కూడా మీ అక్క ఎఫెక్ట్ పడదని గ్యారంటీ ఏంటి అని రెచ్చగొడతాడు. సంధ్య సత్యని ఎదిరించేందుకు సిద్ధమవుతుంది
మహదేవయ్య గన్ రిపేర్ చేసుకుంటే..ఓడిపోతారని భయం లేదా అని అడుగుతుంది. కలలో కూడా మహదేవయ్య ఓడిపోడు అంటాడు. తన భర్తని కాపాడుకునేందుకు ఏమైనా చేస్తానంటుంది.
సత్యభామ జనవరి 03 ఎపిసోడ్ లో నామినేషన్ సంతకాల కోసం బయలుదేరుతుంది సత్యభామ..అడుగు బయటపెట్టడానికి వీల్లేదంటూ గన్ చూపిస్తాడు మహదేవయ్య