✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi January 2nd Episode: లిల్లీని తీసుకొచ్చిన నందు ,కావ్యతో రూమ్ లో రాజ్.. గెస్ట్ హౌజ్ లో ఏం జరగబోతోంది - బ్రహ్మముడి జనవరి 2 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  02 Jan 2025 09:42 AM (IST)
1

నందగోపాల్ ను పట్టుకునేందుకు గెస్ట్ హౌజ్ కి వెళతారు రాజ్ కావ్...దార్లో యాక్సిడెంట్ చేయబోతారు..ఆ వ్యక్తి పేరు సావిత్రి అని పెళ్లిచూపులకు వెళుతున్నా లిఫ్ట్ ఇమ్మంటాడు. రాజ్ తనని తాను డ్రైవర్ ని కావ్య ఓనర్ అని చెబుతాడు. పెళ్లి వద్దంటూ రాజ్ క్లాస్ వేస్తాడు.. ఆడవారి పేరు పెట్టుకున్నాం ఏంటని అడిగితే పెద్ద కథే చెబుతాడు సావిత్రి.

2

సావిత్రి కథ విని కావ్య నవ్వుతుంది..ఇంతలో హోమ్ లోన్ వచ్చిందని చెప్పి కావ్యకు థ్యాంక్స్ చెబుతాడు. కావ్య చేయి పట్టుకునేలోగా రాజ్ కారు బ్రేక్ వేస్తాడు. ఏంటా కారు నడపడం అని మాట్లాడుతూ వెనక్కు వెళ్లి కూర్చుంటాడు. కావ్యను పొగుడుతూ ఉంటాడు. రాజ్ రగిలిపోతుంటాడుయ

3

హాస్పిటల్ లో ఎవరో ఫోన్లో గట్టిగా మాట్లాడుతుంటే నెమ్మదిగా మాట్లాడమని చెబుతాడు కళ్యాణ్. అక్కడ పోలీస్ కనిపిచంగానే అప్పు వచ్చినట్టు ఊహించుకుంటాడు.

4

కొబ్బరి నీళ్లు తాగాలని ఉందని కావ్య అంటే..మీరు అడిగితే నేను ఇవ్వకుండా ఎలా ఉంటానంటూ డ్రైవర్ కారు ఆపు అంటాడు సావిత్రి. రాజ్ సడెన్ బ్రేక్ వేయడంతో గుద్దుకున్న సావిత్రి... రాజ్ ను తిడతాడు..ఆ తర్వాత కావ్య చేయి పట్టుకుని కిందకు దించుతాడు. రాజ్ కు డబ్బులిచ్చి కొబ్బరి బొండాలు తీసుకురా అంటాడు.

5

సావిత్రికి మరో కాల్ రావడంతో కోర్టులో కేసు గెలిచానని..కావ్య చేయి తగలగానే అదృష్టం వరించింది అంటాడు. కావ్యతో సావిత్రి సరదాగా మాట్లాడడం చూసి రాజ్ కొబ్బరిబొండాం కాలిపై పడేస్తాడు. ఆ తర్వాత కావ్య చేయిపట్టుకుని కారెక్కిస్తాడు సావిత్రి.

6

మరోవైపు గెస్ట్ హౌజ్ కి వెళ్లిన నంద గోపాల్... గెస్ట్ హౌజ్‌కు వెళ్లి అక్కడ 3నెలలు ఉంటానని అన్ని ఏర్పాట్లు చేయమని, మేడమ్ కూడా వస్తారని వాచ్‌మెన్‌కి చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొచ్చేందుకు వెళతాడు. మందు, మంచింగ్ ఏర్పాటు చేయమని చెప్పి వెళతాడు

7

కావ్యగారు మీకు పెళ్లైందా అంటాడు సావిత్రి. మీరు మాట్లాడగానే హోమ్ లోన్ వచ్చింది. చేయి తాకగానే ఆస్తి కలిసొచ్చింది.. మీకు పెళ్లైందా అని అడుగుతాడు. నేను ఆడుకుంటాను అనుకుంటుంది కావ్య...మీకు నేను నచ్చానా అని అడుగుతుంది. మీరు లైఫ్ లోకి వస్తే ఏ రాజ్యానికి రాజు అవుతానో అంటాడు

8

SI కాల్ చేసి నందగోపాల్ ఉండే గెస్ట్ హౌజ్ అడ్రస్ చెబుతాడు. ఏంటి మీకు గుడ్ న్యూస్ వచ్చిందా అని సావిత్రి అడిగితే.. అవును మేం కిడ్నాప్ చేయబోయే వ్యక్తి ఎక్కడున్నాడో తెలిసిపోయింది అంటాడు. ఆ మాట విని సావిత్రి భయపడతాడు

9

బ్రహ్మముడి జనవరి 03 ఎపిసోడ్ లో...గెస్ట్ హౌస్ కి వెళ్లిన రాజ్ అక్కడ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చూసి షాక్ అవుతారు. ఇది ఆ బూత్ బంగ్లాకు జిరాక్స్ కాపీలా ఉంది, అసలు మిమ్మల్ని అంటూ కావ్య చీరపై అడుగేసి తూలిపడబోతుంటే రాజ్ పట్టుకుంటాడు. అదే టైమ్ కి నందగోపాల్ అక్కడకు వస్తాడు..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi January 2nd Episode: లిల్లీని తీసుకొచ్చిన నందు ,కావ్యతో రూమ్ లో రాజ్.. గెస్ట్ హౌజ్ లో ఏం జరగబోతోంది - బ్రహ్మముడి జనవరి 2 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.