Satyabhama Serial Today January 10th Highlights: సత్యభామను యుద్ధానికి సిద్ధం చేస్తున్న క్రిష్.. బయటపడిన మహదేవయ్య నిజస్వరూపం - సత్యభామ జనవరి 10 ఎపిసోడ్ హైలెట్స్!
సత్యను కలిసిన రేణుక..తన భర్త-మావయ్య కలసి ఓల్డేజ్ హోంలో వృద్ధులను చంపాలని అంకుటున్నారు కాపాడు అంటుంది.. ఈ విషయం క్రిష్ కి చెప్పు అంటే..తనకు చెప్పినా నమ్మడు అంటుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రిష్ కి అసలు విషయం చెప్పకుండా అర్జెంటుగా వెళ్లాలి పద అంటుంది. ఎక్కడికి అంటే..వృద్ధాశ్రమానికి తీసుకెళ్లు నీకే తెలుస్తుంది అంటుంది. క్రిష్-సత్య కార్లో వెళుతుండగా రుద్ర కాల్ చేస్తాడు. రేణుక చెప్పిందని నీ మొగుడిని తీసుకుని వృద్ధాశ్రమానికి బయలుదేరావ్..మరి నీ తండ్రి సంగతేంటి అని బెదిరిస్తాడు.
కారు ఆపు అని కంగారుపడుతుంటుంది సత్య.. ఎవరు కాల్ చేశారని అడిగినా కానీ రుద్ర కాల్ చేసిన విషయం చెప్పదు సత్య. నాన్న ప్రమాదంలో ఉన్నారు అంటుంది. మీ నాన్న దగ్గరకు వెళ్లాలంటే గంట పడుతుంది..మరి వృద్ధుల సంగతేంటి అడుగుతాడు..
హర్షకి కాల్ చేసిన సత్య..ఏదేదో చెప్పి అర్థమైందా అంటుంది. నేను నాన్న సంగతి చూసుకుంటాను అంటాడు. మనం ఓల్డేజ్ హోంకి వెళదాం పద అంటుంది.
వృద్ధాశ్రమం దగ్గర్నుంచి వాళ్లను బయటకు నెట్టేస్తారు. సత్యకు సపోర్ట్ చేస్తారా అని గొడవ చేస్తారు...
మరోవైపు విశ్వానాథాన్ని వెంటాడుతారు రుద్ర పెట్టిన రౌడీలు... హర్ష విశ్వనాథాన్ని చూసి ఆటోలో ఎక్కించుకుంటాడు..ఏం జరిగిందని అడిగితే సత్యకి సపోర్ట్ చేస్తాం అన్నాంకదా యుద్ధం మొదలైంది అంటాడు. తండ్రి సేఫ్ అని సత్యకి కాల్ చేసి చెబుతాడు
వృద్ధాశ్రమ దగ్గరకు వచ్చేసరికి పెద్దావిడను రౌడీలు తోసేయడంతో ఆవిడ కిందపడిపోతుంది. క్రిష్ ఎంతవారించినా రౌడీలు ఆగరు.. సత్యకు సపోర్ట్ చేస్తామని వాళ్లు చెప్పడంతో దాడిచేస్తారు. నువ్వే MLA గా గెలిచి అందరకీ సహాయం చేయాలని చెప్పేసి ఆ పెద్దావిడ చనిపోతుంది
క్రిష్‌తో స్వార్థం కోసం నీ వాళ్లు ఎంతకు తెగిస్తున్నారో నీకు తెలుస్తోందా..నాకు సపోర్ట్ చేస్తాను అన్నందుకే ఇంతమంది బాగోగులు చూసుకుంటున్న ఈవిడను చంపేసారు అంటుంది. రేపో మాపో నా పరిస్థితి కూడా ఇంతే..ఆ పెద్దావిడ ప్లేస్ లో నీచేతిలో శవంగా నేనే ఉంటాను అంటుంది సత్య.
నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేవు అని ఫైర్ అవుతుంది. క్రిష్ షాక్ అవుతాడు. నువ్వు వెళ్లిపో ఇక్కడి నుంచి.. మీ అన్నయ్య, మీ బాపూ నిన్ను ఇక్కడ చూస్తే ఇంకో ప్రళయం సృష్టిస్తారు..నీవాళ్లే ఇదంతా చేశారని నేను చెప్పినా నమ్మవు..నిన్ను నమ్మించే శక్తినాకు లేదంటుంది.
ఈ ప్రమాదానికి కారణం తానేనని క్షమించమని వేడుకుని ఇంటికి వచేస్తుంది సత్య. క్రిష్ తాగుతూ..సత్య మాటలు తలుచుకుంటాడు...మరోవైపు రూమ్ లో సత్య ఏడుస్తుంటుంది..
సత్యభామ జనవరి 11 ఎపిసోడ్ లో... క్రిష్ కూడా జరిగింది తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. సత్యని సపోర్ట్ చేస్తామని చెప్పినందుకు ఓల్డేజ్ హోమ్ పెద్దావిడను బాపు, అన్నయ్య చంపేశారని జయమ్మకి చెబుతాడు..సత్యకి సపోర్ట్ చేయమంటుంది జయమ్మ. మరోవైపు నేను ఎన్నికల్లో పోటీచేయను అంటుంది సత్య ..అందరూ షాక్ అవుతారు..