Brahmamudi January 10th Episode:రుద్రాణికి చెక్ ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుని చించేసిన కావ్య.. అవాక్కైన రాజ్ - బ్రహ్మముడి జనవరి 10 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్యను ఇరికించేందుకు సీమంతం ప్లాన్ చేసింది రుద్రాణి. ఈ సందర్భంగా అక్కా చెల్లెలు మధ్య గొడవతో పాటూ ఇంట్లో రచ్చ చేయాలని ఫిక్సైంది. పెద్ద లిస్ట్ ప్రిపేరే చేస్తుంటే..నిజంగా అంత గ్రాండ్ గా సీమంతం చేస్తారా అంటుంది స్వప్న. నువ్వు చూస్తుండు అంటుంది రుద్రాణి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకావ్య నువ్వేం పలకవేంటి అని కావాలని రెచ్చగొడుతుంది రుద్రాణి...మీ ఇష్టం అనేసి అక్కడినుంచి వెళ్లిపోతుంది కావ్య. ఆ వెనుకే వెళ్లిన రాజ్ డోర్ వేస్తాడు. ఏంటి మూడో కంటికి తెలియకుండా ఉండేందుకు డోర్ వేశావా అంటాడు. మా అత్తయ్య అన్నదానికి తలూపావు నీకేమైనా పిచ్చా అంటాడు
మనల్ని అందరి ముందు బ్యాడ్ చేసేందుకే మీ అత్తయ్య ప్లాన్ చేసింది అంటుంది. 20 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావ్ అంటాడు. అంత డబ్బు ఇస్తే మా పిన్ని ఫీలవుతుంది అంటాడు. ఎవరికీ ఛాన్స్ ఇవ్వను..కానీ సీమంతం గ్రాండ్ గా జరుగుతుంది అంటుంది కావ్య. నీ ప్లాన్ రివర్స్ అయి అంతా నీపై దండెత్తితే నేను ఏమీ మాట్లాడలేను అంటాడు రాజ్
పెద్ద షాక్ ఇచ్చా కదా అంటుంది రుద్రాణి. సడెన్ గా కోడలిపై అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అంటుంది ధాన్యలక్ష్మి. ఆ కావ్య అందరకీ ఓ న్యాయం వాళ్ల అక్కకు మరో న్యాయం చేస్తుందా అందుకే ఇదంతా ప్లాన్ చేశా అంటుంది.
కావ్య మనకు ఆ అవకాశం ఇవ్వకుండా సింపిల్ గా కానిచ్చేస్తే అని ధాన్యం అంటే..అప్పుడు అక్కా చెల్లెలి మధ్య చిచ్చుపెడదాం అంటుంది
హాస్పిటల్ లో ఉన్న కళ్యాణ్ పై ఫైర్ అవుతాడు రైటర్. పాటరాయమని చెప్పి ఎన్నాళ్లైంది ఇంకా రాయలేదంటాడు. మా తాతయ్య ఆరోగ్యం బాలేదు హాస్పిటల్లో ఉన్నానని రిప్లై ఇస్తాడు. పాట రాసేందుకు అప్పుని ఊహించుకోవాలి అనుకుంటాడు
కనకం ఇంటికెళ్లిన కావ్య..సీమంతం మనింట్లో జరిగేలా అందర్నీ నువ్వే ఒప్పించాలి అంటుంది. సరే అంటుంది కనకం
దుగ్గిరాలవారింట్లో అంతా హాల్లో కూర్చుని ఉండగా..సీమంతానికి అయ్యే ఖర్చు లెక్కలు వేస్తారు రుద్రాణి, రాహుల్. కావ్య ఒప్పుకుంటుందా అనుకుంటారు ఇందిరాదేవి-అపర్ణ
ఇదిగోండి 20 లక్షల చెక్ అంటూ రుద్రాణి చేతిలో పెడుతుంది కావ్య. రుద్రాణి మురిసిపోతుంది ఇంతలో కనకం ఎంట్రీ ఇస్తుంది. పుట్టింట్లోనే సీమంతం చేయాలని మా పూర్వీకుల తీర్మానం అంటుంది. మీ ఇంట్లో జరగడమే మంచిది అంటుంది ఇందిరాదేవి. ఇక ఆ 20 లక్షల చెక్ తో అవసరం లేదుకదా అని కావ్య తీసుకుని చింపేస్తుంది...