Satyabhama Serial Today December 31 Highlights: గదిలో ప్రణయం బయట ప్రళయం .. సత్య క్రిష్ ముచ్చట మామూలుగా లేదుగా - సత్యభామ డిసెంబర్ 31 హైలెట్స్!
క్రిష్ వింటున్నాడని తెలిసి సత్యపై అభిమానం , క్రిష్ పై ప్రేమ నటిస్తాడు మహదేవయ్య. అదనంతా నిజమే అనుకున్న క్రిష్ కోపంగా రూమ్ లోపలకు వెళతాడు. సాంబార్ చేశాను నీకోసం ఇదిగో బాక్స్ తీసుకొచ్చానంటూ మెలికల్ తిరుగుతుంది సత్య..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేను MLA అవుతానంటే మీ బాపూనే ఏమనడం లేదు..నీకేంటి ప్రాబ్లెమ్ అంటుంది. మా బాపూ మంచోడు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయ్ అంటాడు. నువ్వూ అదే చేయి..నేను గెలుస్తానని భయమా అంటుంది...అటకపై బాక్స్ తీసుకోవడం చేతకాదు MLA అవుతాదంట అంటూ ఫైర్ అవుతాడు
సత్య క్రిష్ కి దగ్గరగా వెళ్లడంతో మాటల్లేవ్..కావాలనే దూరం పెడుతున్నావ్ కదా అంటుంది. నేను ఎలక్షన్లో పోటీ చేస్తానని ఒప్పుకుంటానంటేనే వదిలేస్తా అంటుంది. ఎలక్షన్ గొడవలన్నీ బయట చూసుకుందాం..రూమ్ లో భార్య భర్తలానే ఉందాం అంటుంది
హర్ష నందిని బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మధ్యలో బండి ఆగిపోవడంతో ఫైర్ అవుతుంది నందిని. పెళ్లాన్ని బయటకు తీసుకెళ్లడం నీ బండికి కూడా ఇష్టం లేదంటుంది. బండికి పంచర్ వేయించుకుని వస్తానంటాడు
తన ఇంటికి వచ్చి ఇల్లు నాదంటూ డ్రామా ఆడిన వ్యక్తి... మహదేవయ్యను కలసి డబ్బు తీసుకున్న విషయం గుర్తుచేసుకుంటుంది. చీకట్లో బాణం వేస్తానంటూ..వెళ్లి..నీ పైసలన్నీ నీకు ముట్టాయా అని అడుగుతుంది. ఏ పైసలమ్మా అని తడబడతాడు.. బర్త్ డే రోజు మా బాపూ నీకిచ్చారు కదా..నాకూ మా బాపూకి మధ్య సీక్రెట్స్ లేవంటుంది. ఆ మాటలకు పడిపోయిన ఆ వ్యక్తి..మహదేవయ్య చేసిన దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కుట్ర మొత్తం బయపెట్టేస్తాడు. ఇంతలో హర్ష రావడంతో వెళ్లిపోతుంది నందిని.
మహదేవయ్య ఇంటికి మీడియావాళ్లు వస్తారు. నాకు చెప్పలేదేంటి పెనిమిటీ తయారై వస్తానంటుంది. వాళ్లని నేను పిలవలేదంటాడు మహదేవయ్య. నేనే పిలిచానంటూ వస్తుంది సత్య. ఇండిపెండెంట్గా విజిల్ గుర్తు మీద MLAగా పోటీ చేస్తున్నానని మీడియా ముందు చెబుతుంది. ఒకే ఇంటి నుంచి ఇద్దరు పోటీదారులా అని షాక్ అవుతారు
కబ్జా ఇష్యూ..ఆ మహిళకు హామీ ఇచ్చిన సంగతి మొత్తం చెప్పి MLA గా తనకు బలం కావాలని చెబుతుంది సత్య. రియాక్టైన క్రిష్.. నా తండ్రి మహదేవయ్యను నేను గెలిపించుకుంటానంటాడు క్రిష్. సత్యను కొట్టేందుకు భైరవి చేయి ఎత్తితే మహదేవయ్య అడ్డుకుని సత్యకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్లిపోతాడు
సత్య MLA గా పోటీ చేస్తున్నట్టు టీవీలో న్యూస్ చూసి విశ్వనాథం ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. వదిన MLA అయ్యేవరకూ వదలదు అంటుంది నందిని...
సత్యభామ జనవరి 01 ఎపిసోడ్ లో...అందరి ముందూ మహదేవయ్యను నిలదీస్తుంది నందిని. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని మా ఇంటిని కబ్జా చేసేందుకు వచ్చాడు ఆ శేషు..బాపూనే వాడిని పంపాడంటుంది. క్రిష్ వెంటనే ఆ శేషుని పిలిచి నిలదీస్తాడు...