Satyabhama Serial Today December 25 Highlights: సత్య vs క్రిష్ ప్రేమ యుద్ధం కాదు పొలిటికల్ వార్.. లెక్కలు మారాల్సిందే - సత్యభామ డిసెంబర్ 25 హైలెట్స్!
మహదేవయ్యకి MLA టికెట్ రావడంతో సంబరాలు చేస్తాడు. ఆ తర్వాత నామినేషన్ ఫాం తీసుకొచ్చేందుకు వెళతానంటే..ఒకటా రెండా చిన్న కోడలా అంటాడు మహదేవయ్య..రెండెందుకు అని క్రిష్ అంటే.. మావయ్యకి సెంటిమెంట్ ఏమో అని సెటైర్ వేస్తుంది సత్య..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రిష్ నామినేషన్ ఫామ్ తీసుకొచ్చేందుకు వెళుతుండగా మా స్థలాన్ని ఓ రాక్షసుడు కబ్జా చేశాడు మీరే సహాయం చేయగలరని ఓ మహిళ వచ్చి ప్రాధేయపడుతుంది. వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని చెబుతాడు మహదేవయ్య. వాడు మీ మనిషే కేశవ అని చెబుతుంది. నేను చేసేదేం లేదు పోమ్మా అని పంపించేస్తాడు
ఆగండి.. ఓట్ల లెక్కే కానీ మానవత్వం లేదమ్మా.. ఉన్నదాంట్లో దిక్కులేని వృద్ధులకు ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటోంది. కష్టంలో ఉండి సహాయం కోసం వస్తే ఇదేనా మీరు ట్రీట్ చేసే పద్దతి..వాళ్లకి సహాయంగా నిలబడతాను అంటుంది సత్య. ఇంట్లో వాళ్లు ఎంతచెప్పినా సత్య తగ్గేదే లే అంటుంది.
భైరవి బెదిరిస్తూ అడుగుముందుకు వేయగానే ఫైర్ అవుతుంది సత్య. తప్పు చేసిన వాడికంటే సరిదిద్ద గల స్థాయిలో ఉండి సాయం చేయని వారిదే అసలు తప్పు. ఏం కావాలంటే అది చేసుకో.. నోరు పెట్టుకుని వెళితే న్యాయం జరుగుతుంది అనుకుంటోంది పోయిరా సత్య అంటాడు
సత్య కబ్జా గురించి కేశవ గురించి చెప్పగానే పోలీసులు కంప్లైంట్ తీసుకునేందుకు భయపడతారు. ఆవిడవే ఫేక్ డాక్యుమెంట్స్ అనేస్తారు. కోర్టుకి వెళదాం అంటుంది సత్య. నేను మీకోసం పోరాడుతా అని ధైర్యం చెబుతుంది.
క్రిష్ వెళుతూ వెళుతూ..నర్సింహను చూసి మా బాపూకి MLA టికెట్ కన్ఫామ్ అయిందని సెటైర్ వేస్తాడు. మహదేవయ్య ఎమ్మెల్యే అవ్వడం జరగదని నర్సింహ అంటే..ఎవరు అడ్డం వచ్చినా గెలిపిస్తానంటాడుక్రిష్... సేమ్ టైమ్ ఎవరు అడ్డం వచ్చినా నాదే గెలుపు అంటుంది సత్య.
మహదేవయ్య ఒక్కడూ కూర్చని ఉండగా వచ్చిన భైరవి..నీ చిన్నకోడలు ఇలా ప్రవర్తిస్తున్నా నువ్వేం మాట్లాడడం లేదు..నీ తీరు అర్థం కావడం లేదంటుంది. సత్య వస్తే దాని సంగతి చూస్తా అని భైరవి అంటే..నేనుచూసుకుంటా నువ్వు వదిలెయ్ అని లోపలకు పంపిస్తాడు.
ఎగురుకుంటూ వెళ్లావ్ ఏం జరిగిందని సెటైర్ వేస్తాడు మహదేవయ్య. నాకు పవరు వస్తే అప్పుడు చెబుతా మీ సంగతి అంటుంది. ఏం చేయలేవు నీ భర్తతో కాపురం చేసుకో పో అంటాడు.
సంధ్య పరీక్షలకు చదువుతూ ఉంటుంది...ఇంతలో మైత్రి ఎంట్రీ ఇస్తుంది. విశ్వనాథం దగ్గరకు వెళ్లి నిస్సహాయ స్థితిలో నాకు ఆశ్రయం ఇచ్చారు...హర్ష నాకోసం కష్టాలు పడ్డాడు..నా ఇంటిని అమ్మి నావల్ల అయిన అప్పు తీర్చండి అని డాక్యుమెంట్స్ ఇస్తుంది. హర్ష వద్దని చెబుతాడు...
సత్యభామ సీరియల్ డిసెంబర్ 26 ఎపిసోడ్ లో...ఎవర్తో ముసల్ది సహాయం కోసం వస్తే నీ భార్య నీ బాపూకి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లిందన చెపుతుంది. తప్పు చేశావ్ సత్య అన్న క్రిష్.. వాళ్లకి న్యాయం చేస్తాను..మా బాపుకి సారీ చెప్పేందుకు సిద్ధంగా ఉండు అంటాడు