Brahmamudi December 25th Episode: అసలు శత్రువు స్వప్నే..కావ్యకు పెద్ద షాకే ఇది - బ్రహ్మముడి డిసెంబరు 25 ఎపిసోడ్ హైలెట్స్!
కోట్ల ఆస్తిని చిల్లగా ఖర్చుచేయడం నాకు ఇష్టంలేదంటూ ఇడ్లీ ఒక్కటే ప్రిపేర్ చేస్తుంది కావ్య. ధాన్యలక్ష్మి, రుద్రాణి రచ్చ చేస్తారు. ప్రకాశానికి ధాన్యం కంప్లైంట్ చేసినా..కావ్య చేస్తోన్నది మంచి పనే అని సపోర్ట్ చేస్తాడు. నేను ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను ఎవరు ఆపుతారో చూస్తానంటుంది ధాన్యం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆకలి అనగానే కడుపునిండా భోజనం పెట్టే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావంటే..ఏదో కారణం ఉండి ఉంటుందని అర్థం చేసుకున్నా అంటుంది అపర్ణ. కారణం ఉంది అత్తయ్యా..చెప్పే రోజు వస్తే మీకే ముందు చెబుతాను..అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంటుంది కావ్య.
కావ్య లోపలకు రావడం చూసి రుద్రాణి కావాలానే టిఫిన్ల లిస్ట్ చెప్పి చాలా ఉన్నాయ్ రా ధాన్యలక్ష్మి అని పిలుస్తారు. నువ్వు మాతో పాటూ తిను అని స్వప్నను ధాన్యలక్ష్మి అంటే..అడ్డమైన గడ్డి తినొద్దని డాక్టర్ చెప్పారంటుంది. వీళ్లని కంట్రోల్ చేద్దామంటే రెచ్చిపోతున్నారు.. వీళ్లని ఎలా కంట్రోల్ చేయాలో ఏంటో అనుకుంటుంది.
సీతారామయ్యను చూస్తూ ఇందిరాదేవి కన్నీళ్లుపెట్టుకుంటుంది. నువ్వు వదిలి వెళ్లిపోతే ఆస్తుల కోసం అనుబంధాలను వదులుకునే కుటుంబంలో దిక్కులేని పక్షిని అయిపోతానని భయంగా ఉంది బావా అంటుంది.ఇంతలో అక్కడకు వచ్చిన రాజ్, కావ్య నచ్చచెబుతారు. బిల్ కట్టమని చెప్పి కల్యాణ్ కి ఐదు లక్షలు కట్టమని చెక్ ఇస్తాడు రాజ్..
ఏం వంట చేశావ్ అని శాంతను అడుగుతుంది రుద్రాణి. తోటకూర పప్పు, మజ్జిగ అని శాంత చెబితే గేదేలు, గొర్రెలు తినేది ఏం చేయలేదా అని ధాన్యలక్ష్మీ అంటే..చికెన్, మటన్, ఫ్రాన్స్ అని ధాన్యం వంతపాడుతుంది. అమ్మగారు వద్దన్నారు అని చెబుతుంది. తినే ఇంట్రెస్ట్ లేదంటారు.
మనకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకుందాం అని కార్డ్స్ తీస్తారు...అవి బ్లాక్ అయి ఉండడంతో షాక్ అవుతారు. ఉదయం టిఫిన్ ఎఫెక్ట్ ఇది అనుకుంటారు. పద వెళ్లి నిలదీద్దాం అంటారు. బ్యాంక్ కు కాల్ చేసి సుభాష్ అడిగితే కావ్య మేడం మెయిల్ చేశారు కార్డ్స్ బ్లాక్ చేశాను అంటారు. ఆ మాట విని ఇద్దరూ రెచ్చిపోతారు..
కావ్య - రాజ్ వెళుతుంటే రాజ్ కు బ్యాంక్ నుంచి జీరో బ్యాలెన్స్ మెసేస్ వస్తుంది. ఐదు లక్షలు క్లియర్ చేయమని మెసేజ్ వచ్చింది కానీ జీరో బ్యాలెన్స్ అని మెసేజ్ వచ్చిందని చెబుతాడు..ఇద్దరూ షాక్ అవుతారు. కంపెనీ వాళ్లు 25 లక్షలు డ్రా చేశారా అని మేనేజర్‌కు కాల్ చేస్తే.. 20 లక్షలు వాడుకోమన్నారు కదా. కానీ, 15 లక్షలే ఉన్నాయంటారు.
ఇంకా పది లక్షలు ఏమైనట్టు అని రాజ్ అంటాడు. వచ్చేటప్పుడు మా అక్కకు ఖాళీ చెక్ ఇచ్చి వచ్చాను కదా..అదేమైనా డ్రా చేసిందంటారా అని కావ్య అంటుంది. మా పిన్ని, అత్త అయితే ఆస్తిలో హక్కుందని చేస్తారు. కానీ, స్వప్న ఎందుకు అలా చేస్తుందంటాడు రాజ్. స్వప్న లిఫ్ట్ చేయదు. ఇప్పటికిప్పుడు పది లక్షలు అంటే ఎలా తీసుకొస్తాం అని రాజ్ అంటాడు.
ఆకలితో ఉన్న ధాన్యలక్ష్మీ, రుద్రాణి..ఇంకాసేపు తినకుండా ఉంటే షుగర్ లెవెల్స్ పడిపోతాయ్ మావల్లకాదంటారు. పద పెట్టిన గడ్డి తినేసి ఇచ్చిన కుడితి తాగేద్దాం అనుకుంటారు. వెళ్లి శాంతను వడ్డించమంటారు.. మిగిలినది పాడైపోతుందని ఇప్పుడే ముష్టివాళ్లకు పెట్టేశాను అంటుంది శాంత.
బ్రహ్మముడి డిసెంబరు 26 ఎపిసోడ్ లో కావ్య రాగానే కార్డ్స్ ఎందుకు బ్లాక్ చేశావని నిలదీస్తారు. మరి మీ అక్కకు మాత్రం గోల్డ్ నెక్లెస్ కొనొచ్చా అని నిలదీస్తారు. ఈ నెక్లెస్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడిది అని స్వప్నను నిలదీస్తుంది. నువ్వే కదా చెక్ ఇచ్చావ్ అని స్వప్న అంటుంది. అందరూ షాక్ అవుతారు...