Satyabhama Serial Today December 24 Highlights :మహదేవయ్యపై సత్య పోలీస్ కంప్లైంట్ ..క్రిష్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది - సత్యభామ డిసెంబర్ 24 హైలెట్స్!
సత్య-క్రిష్ మాట్లాడుకుంటారు..జీవితాంతం నీ చేయి వదలను అని ప్రామిస్ చేస్తాడు క్రిష్. మాట తప్పితే నా ప్రాణం పోయినట్టే అంటాడు. ఇదంతా విన్న మహదేవయ్య కోపంతో రగిలిపోతాడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏం కావాలో కోరుకో అని క్రిష్ అంటే.. అవసరం వచ్చినప్పుడు కోరుతాను అంటుంది. కచ్చితంగా తీరుస్తానని మరోసారి చెబుతాడు క్రిష్
దిమ్మతిరిగే షాక్ తగిలిందా కోడలా అంటాడు మహదేవయ్య. ఏదోలా సాక్ష్యాలు సాధించి మీ అంతు చూస్తాను అంటుంది. నువ్వు ముందు నామినేషన్ వేయి అప్పుడు చూస్తానంటాడు.
నువ్వేం తప్పు చేస్తావ్ అంటే..తప్పే బాపు నువ్వు సింహాసనం మీద కూర్చుని ఆర్డర్ వేస్తే నేను పనోడి లెక్క అన్నీ చేయాలి ఇన్నాళ్లూ అదే జరుగుతోంది కదా రూల్స్ మార్చావేంటి అంటాడు. నువ్వు ఏదో దాస్తున్నావ్ బాపూ అంటాడు
నా చిన్న కోడలికి నేను ఎన్నికల్లో నిలబడడం ఇష్టం లేదు..నా వెంట తిరగొద్దని సత్య చెబితే నా పరిస్థితి ఏంటి అంటాడు. నీ వెనుక తిరిగొద్దని సత్య చెప్పదు..తన భయం నాకు ఏం అవుతుందనే అంటాడు. అయినా నీకు దూరం ఉండమని సత్య చెబితే ఎందుకు ఉంటాను అంటాడు
సత్య అంటే నాకు ప్రాణమే కానీ నా కాళ్లకి అడ్డుపడనంత వరకే ..నిన్ను MLA ని చేసేవరకూ నీ వెంటే ఉంటా దానికోసం ఎవరినైనా ఎదిరిస్తా అంటాడు. అయితే మాటివ్వు అని ప్రామిస్ తీసుకుంటాడు. అది చూసి సత్య కోపంగా వెళ్లిపోతుంది.
హర్షకి కాల్ చేస్తుంది మైత్రి. నిన్ను ఉద్దరించాలని నా మొగుడు లేని పోని అప్పులు చేసి రోడ్డుకి ఈడ్చేశాడని నందిని ఫైర్ అయితే..సారీ చెబుతుంది మైత్రి. ఈ ఇంటివైపు వచ్చినా హర్షకి కాల్ చేసినా మర్యాద ఉండదంటుంది.
బాపూకి MLA టికెట్ కన్ఫామ్ అయిందని క్రిష్ సందడి చేస్తాడు. అంతా స్వీట్స్ తినిపించుకుని సంతోషంగా ఉంటారు.
డిసెంబర్ 25 ఎపిసోడ్ లో...తమకు సమస్య వచ్చింది తీర్చమని స్థానికులు కొందరు ఇంటికి వస్తారు.. నా వల్లకాదు వెళ్లిపోండి అంటాడు మహదేవయ్య. వాళ్లకి సహాయం చేస్తానంటూ రంగంలోకి దిగుతుంది సత్య..
మైత్రి మాత్రం నేను హర్షని వదలను అంటుంది. ఇంట్లో వాళ్ల జాలి సంపాదించుకునేందుకు ఈ ఇంటిని అమ్మేసి నాటకం మొదలుపెడతా అంటుంది.
డిసెంబర్ 25 ఎపిసోడ్ లో...తమకు సమస్య వచ్చింది తీర్చమని స్థానికులు కొందరు ఇంటికి వస్తారు.. నా వల్లకాదు వెళ్లిపోండి అంటాడు మహదేవయ్య. వాళ్లకి సహాయం చేస్తానంటూ రంగంలోకి దిగుతుంది సత్య..