Pawan Kalyan tour In Gudivada: గుడివాడ పర్యటనలో పవన్ కల్యాణ్ ఏం చేశారంటే!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గాల్లో పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమల్లాయపాలెం పర్యటించిన పవన్ కల్యాణ్ గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పరిశీలించారు.
గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 44 గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థకు మరమ్మత్తులు చేయించారు.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి నాణ్యత లేదన్న విషయం పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ దృష్టికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీసుకొచ్చారు.
రూ. 3.8 కోట్ల నిధులు కేటాయంచి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించారు పవన్ కల్యాణ్.
ఫిల్టర్ బెడ్లు పూర్తిగా దెబ్బతినడంతో పంచాయతీకి రూ. 4 లక్షల ఖర్చు చేసి ఫిల్టర్ బెడ్లు మార్పు చేశారు.
14 గ్రామాల పరిధిలో ఫిల్టర్ బెడ్ల మార్పు ప్రక్రియ పూర్తి అయింది. దీన్ని పవన్ క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.
స్టోరేజీ ట్యాంక్, ఫిల్టర్ బెడ్లతోపాటు- 14 గ్రామాల్లో మరమ్మతులకు ముందు, తర్వాత నీటి నమూనాలను పవన్ పరిశీలించారు.
క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం గుడివాడ నియోజకవర్గానికి వచ్చిన పవన్‌కు స్థానిక ఎమ్మెల్యే వెనిగెండ్ల రాము ఘన స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
రక్షితమంచి నీటి ప్రాజెక్టును పరిశీలించడానికి ముందు పవన్ కల్యాణ్ కంకిపాడు మండలంలో సిమెంట్ రోడ్డు నాణ్యతను పరిశీలించారు.
పల్లె పండుగలో ఇచ్చిన మాట ప్రకారం కంకిపాడు మండలం గొడవర్రు గ్రామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని పవన్ కల్యాణ్ పరిశీలించారు.
అక్కడ 1:1 అడుగు తవ్వి BT రోడ్డు 3 లేయర్ల నాణ్యతను స్వయంగా పవన్ కల్యాణ్ పరిశీలించారు.
కంకిపాడు మండలం గొడవర్రు గ్రామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి 4.67 కి.మీ రోడ్డును రూ. 3.75 కోట్ల నిధులతో నిర్మించారు.
ఇప్పటికే 1 కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తైంది. మిగతా 3.67 కి.మీ రోడ్డు నిర్మాణ దశలో ఉంది. సంక్రాంతి నాటికి పూర్తి కానుంది.