Brahmamudi December 24th Episode: కళావతికి థ్యాంక్స్ చెప్పి మురిసిన రాజ్.. కావ్య కొంప ముంచేసిన స్వప్న - బ్రహ్మముడి డిసెంబరు 24 ఎపిసోడ్ హైలెట్స్!
పెట్టే ప్రతి పైసాకి లెక్క చెప్పాల్సిందే అని కావ్య స్ట్రాంగ్ గా చెబుతుంది. మీ మనవరాలు రెచ్చిపోయి మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరా అంటూ ఇందిరాదేవిని నిలదీస్తారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. మీరంతా కలసి నన్ను పిచ్చిదాన్ని చేస్తారని ఆయన ఊహించే ఇలా చేశారని ఇందిరాదేవి అంటుంది. అపర్ణ, రాజ్ కూడా కావ్యకు సపోర్ట్ చేస్తారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజ్ నువ్వు కూడా అంతేనా అని రుద్రాణి అంటే.. నానమ్మే ఏమీ అనలేనప్పుడు నేనేం అంటాను అంటాడు..తను ఎలా చెబితే అలా నడుచుకుందాం అంటాడు. థ్యాంక్స్ మీకు బాగా అర్థమైంది..వీళ్లకి డైజెస్ట్ అయ్యేందుకు టైమ్ పట్టేలా ఉంది అంటుంది. ఇంకా ఎనీ డౌట్స్ అంటే... నో డౌట్స్ ఆట మొదలైనట్టుందాడు ప్రకాశం
కావ్య రూమ్ లో ఉండగా వెళ్లిన రాజ్.. ఓ మాట అడగాలి అంటాడు. జాలి, దయ అని ఇంకొకరు హర్ట్ కాకుండా మాట్లాడే నువ్వు ఇప్పుడు అందరి నోళ్లూ మాయిస్తున్నావ్ అసలు నువ్వేనా అంటాడు. నాలో ఉన్న మీరు..మిమ్మల్ని చూసే నేర్చున్నాను..ఓ బాస్ గా మీరు అందరితో ఎలా ఉంటారో అదే ఇంట్లో ఇంప్లిమెంట్ చేశానంటుంది
నాకు కావాల్సింది ఇంటి గౌరవం, తాతయ్య మాట..అందుకోసం నేను వాళ్లకు శత్రువుగా మారినా పర్వాలేదు అంటుంది. ఇంట్లో, ఆఫీస్ లో సపోర్ట్ కి థ్యాంక్స్ అంటాడు. మీక్కూడా థ్యాంక్స్...పెళ్లానికి థ్యాంక్స్ చెప్పే మొగుడు దొరికినందుకు అంటుంది.
ఇక డబ్బు రాదా..ఈ అవమానం తట్టుకోలేకపోతున్నా అని రుద్రాణి ధాన్యంతో అంటుంది. ఇంతలో పనిమనిషి శాంత వస్తుంది. దీన్ని వద్దన్నా కదా ఎందుకు వస్తోంది అని రుద్రాణి ఆపి అవమానిస్తుంది. నేను నా కాళ్లపై నేను నిలబడుతున్నా.. పరాయి పంచన పడి బతకడం లేదంటుంది. మేడం ఫోన్ చేస్తే నేను వచ్చానని శాంత అంటే..నేను తీసుకొచ్చానంటుంది కావ్య.
ఇంట్లో నా మాటకు విలువలేదా అని రుద్రాణి అంటే అమ్మమ్మ గారి గురించి మీకు పట్టింపే లేదా అని కావ్య రివర్సవుతుంది. మాటకు మాట చెప్పకు అంటే నేనింతే ఇలానే ఉంటాను అంటుంది. శాంతను బయటకు వెళ్లమని రుద్రాణి అంటే లోపలకు వెళ్లమని కావ్య చెబుతుంది. డబ్బు లిచ్చేది నేను అంటుంది.
నీ కోడలు ఎలా మాట్లాడుతుందో చూశావా అని అపర్ణతో అంటారు.. నౌకర్ల దగ్గర హుందాగా ఉండకపోతే ఇలానే జరుగుతుంది అంటుంది. ఇంట్లో కావ్య పరిపాలన మొదలైంది..పాత కోపాలు , కక్షలు తీర్చుకుంటోందని మాట్లాడుకుంటారు
సీతారామయ్య ఎప్పుడు కోలుకుంటారని అడిగితే..అది మేం చెప్పలేం అంటారు డాక్టర్స్. తొందరగా లేచిరా బావా అంటుంది ఇందిరాదేవి.
టిఫిన్ ఇడ్లీ ఒక్కటే ఉండడంతో చిరాకుపడతారు. రోజుకి ఒక టిఫిన్ మాత్రమే చేయమన్నారు కావ్య మేడం అంటుంది. ఫుడ్ వేస్ట్ చేయడం కుదరదు..ఇన్నాళ్లూ లక్షలు వేస్ట్ చేశారు. డబ్బు, ఆహార పదార్థాలు దుబారా చేయడం నాకు నచ్చదంటుంది
కావ్యపై ప్రకాశానికి కంప్లైంట్ చేస్తుంది. ఇంట్లో చిల్లర గొడవ అని నువ్వే అన్నావుగా పట్టించుకోవాల్సిన అవసరం లేంటాడు.
బ్రహ్మముడి డిసెంబర్ 25 ఎపిసోడ్ లో...కావ్య, రాజ్ ఇంటికి రాగానే మా కార్డ్స్ ఎందుకు బ్లాక్ చేశావ్ అని నిలదీస్తుంది రుద్రాణి. అనవసరమైన ఖర్చులు పెట్టకూడదని బ్లాక్ చేశానంటుంది. అత్తింటివాళ్ల కార్డ్స్ బ్లాక్ చేసి మీ అక్కకు గోల్డ్ నక్లెస్ కొనిచ్చావా అంటుంది. డబ్బు ఎక్కడిది అని స్వప్నను కావ్య నిలదీస్తే నువ్వే కదా ఇచ్చావ్ అంటుంది..