Satyabhama Serial Today December 23 Highlights :మహదేవయ్య కొత్త కుట్రని సత్య ఎలా ఎదుర్కోబోతోంది.. క్రిష్ దారెటు - సత్యభామ డిసెంబర్ 23 హైలెట్స్!
సత్యభామ సీరియల్ కీలక మలుపు తిరగబోతోంది. ఇప్పటివరకూ మహదేవయ్య - సత్యభామ మధ్య ఎత్తులు, పై ఎత్తులు నడిచాయ్. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇద్దరి మధ్యా వార్ నడిచింది. కానీ ఇప్పుడు నేరుగా జనం మధ్యకు రంగంలోకి దిగబోతున్నారు..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసై అంటే సై అని ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు మహదేవయ్య-సత్య. అయితే నువ్వు MLA గా పోటీచేస్తాననే మాట నీ భర్త క్రిష్ కి చెబితే భూకంపం వస్తుంది..నీ మెడలో తాళి తెగుతుంది..నీ భర్తకు నువ్వు పూర్తిగా దూరమవుతావ్ అని బెదిరిస్తాడు మహదేవయ్య..
ఏది ఏమైనా ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్న సత్య..ఆ విషయం క్రిష్ కి చెప్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది కానీ క్రిష్ మాట్లాడే అవకాశం ఇవ్వడు. పుట్టిన రోజువేడుకలు గ్రాండ్ గా జరుగుతాయి
ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో క్రిష్..సత్యకు థ్యాంక్స్ చెబుతాడు. నా బర్త్ డే ఇంత గ్రాండ్ గా చేశావ్ సంపంగి..నీకోసం ఏమైనా చేస్తాను ఏ కావాలో అడుగు అంటాడు. అయితే మాటివ్వు క్రిష్..ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వదిలిపోనని అని మాట తీసుకుంటుంది...
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ చేయి వీడను..నీకు సపోర్ట్ గా నిలబడతాను అని మాటిస్తాడు క్రిష్..అప్పటికి క్రిష్ ప్రాణం కుదుటపడుతుంది.. మరోవైపు గేమ్ ని తనవైపు తిప్పుకునేలా ప్లాన్ చేసుకుంటాడు మహదేవయ్య
క్రిష్ ని పిలిచి తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం గురించి మాట్లాడుతాడు. నువ్వు MLA అయ్యేవరకూ నేను నిద్రపోను బాపూ..అది నా జీవిత ఆశయం అంటాడు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ నన్ను MLA చేస్తానని మాటివ్వు అంటాడు...క్రిష్ ప్రామిస్ చేస్తాడు.. అది సత్య చూస్తుంది..
MLA కావాలన్న సత్య కోరిక తెలియకుండానే అండగా నిలబడతా అని ప్రామిస్ చేశాడు క్రిష్..మరోవైపు మహదేవయ్యని MLA చేస్తానని మాటిచ్చాడు.. ఇప్పుడు సత్య తన మనసులో మాట బయటపెడితే క్రిష్ రియాక్షన్ ఏంటి? భార్యా - తండ్రా? క్రిష్ దారెటు...