Satyabhama Serial Today December 19 Highlights : ఈ ఇంటికి నువ్వే పరాయివాడివంటూ బాంబ్ పేల్చిన సత్య..షాక్ లో క్రిష్- సత్యభామ డిసెంబరు 19 ఎపిసోడ్ హైలెట్స్!
క్రిష్ పుట్టిన రోజు సందర్భంగా నలుగుపెట్టి స్నానం చేయిస్తానని సత్య అంటే..తప్పించుకుని తిరుగుతాడు. సినిమాల్లో చూసినట్టు స్నానం చేయిద్దాం అనుకున్నా అని సత్య అనగానే..దాక్కున్న క్రిష్ బయటకు వచ్చేస్తాడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇద్దరూ ఒకపై మరొకరు నీళ్లు చల్లుకుంటూ పరుగులు తీస్తారు..ఇంతలో జయమ్మ వచ్చి క్రిష్ మీద సెటైర్లు వేస్తుంది. సత్య ఆశపెట్టి మోసం చేసిందని బామ్మకు కంప్లైంట్ చేస్తాడు క్రిష్. పాయసం అని మాట మార్చేస్తుంచి క్రిష్.
తల తుడుస్తూ..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అంటుంది సత్య..ఇంతలో జయమ్మ వచ్చి పాయసం ఏదని వరుస ప్రశ్నలు వేస్తుంది.
క్రిష్ కి నచ్చిన కలర్ డ్రెస్ గిఫ్ట్ గా ఇస్తుంది. మనసులో మాట చెప్పాలి అనుకుంటుంది. సంతోషంగా ఉన్నా ఈ రోజంతా అలానే ఉండనీ తర్వాత మాట్లాడుకుందాం అంటాడు.
సత్య చెల్లి సంధ్య సంజయ్‌కి కాల్ చేసి..బర్త్ డే విశెష్ చెబుతుంది. ఎక్కడో ఉండి శుభాకాంక్షలు చెప్పడం ఏంటి..నువ్వు వచ్చి డైరెక్ట్ గా చెప్పు అంటాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంది సంధ్య
క్రిష్‌కి ఎమ్మెల్యే పోటీ గురించి ఎలా చెప్పాలా వద్దా అని సత్య టెన్షన్ పడుతుంటే మహదేవయ్య ఎదురు పడతాడు. ఎలక్షన్లో నిలబడతానని నీ మొగుడికి చెబితే ఓ పిడుగు పడిన సౌండ్ వస్తుంది.. ఆ వెనుకే పెద్ద ఆర్తనాదం వినిపిస్తుంది..అది నీది.. ఆ తర్వాత పెద్ద నువ్వు వినిపిస్తుంది అది నాది అని ఇన్ డైరెక్ట్ గా బెదిరిస్తాడు
క్లైమాక్స్ ఎవరి చేతిలో ఉందో చూసుకుందాం మావయ్య అని సవాల్ చేస్తుంది సత్య. రాసిపెట్టుకో నీ మొగుడికి నువ్వు చేసే ఆఖరి పుట్టినరోజు ఇదే వచ్చే ఏడాదికి పుట్టింట్లో పడి ఏడుస్తావ్ అంటాడు. పోయేకాలం దగ్గరపడింది నాకు కాదు మీకు అని ఇచ్చిపడేస్తుంది
క్రిష్ ని కొత్త డ్రెస్ లో చూసి మురిసిపోతుంది సత్య.. కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం అంటుంది. సరే అని సత్య చేయి పట్టుకుని కూర్చుంటాడు. నేను చెప్పేది విన్నాక నా చేయి పట్టుకుంటావో వదిలేస్తావో తెలియదు క్రిష్ అని టెన్షన్ పడుతుంది..
సత్యభామ డిసెంబర్ 20 ఎపిసోడ్ లో..ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా అని చెప్పేందుకు పాయసం తీసుకుని వెళుతుంది సత్య..చెప్పేలోగా అక్కడకు సంజయ్ ఎంట్రీ ఇస్తాడు . భార్య భర్త పర్సనల్ గా మాట్లాడుకున్నప్పుడు మధ్యలోకి రావడం మానర్స్ కాదంటుంది సత్య.. సంజయ్ పరాయివాడు కాదుకదా అని క్రిష్ అంటే అవును నువ్వే ఈ ఇంటికి పరాయివాడివి అని బాంబ్ పేలుస్తుంది సత్య...క్రిష్ షాక్ అవుతాడు