R Ashwin: టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లలో అశ్విన్ స్థానం ఎంతంటే?
శ్రీలంక గ్రేట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్. 133 టెస్టు మ్యాచ్‌ల్లో ఈ రికార్డు సృష్టించాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు దివంగత షేన్ వార్న్ తన టెస్టు కెరీర్‌లో 145 మ్యాచ్‌లు ఆడాడు, అందులో 708 వికెట్లు పడగొట్టాడు.
జేమ్స్ అండర్సన్ 188 మ్యాచుల్లో 704 వికెట్లు తీశాడు. ప్రపంచంలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్. ఇతనే
అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్.
స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టుల్లో 604 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్.
గ్లెన్ మెక్‌గ్రాత్ 124 మ్యాచ్‌ల్లో 563 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు దాటిన తొలి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్.
రవిచంద్రన్ అశ్విన్ 106 టెస్టుల్లో 537 వికెట్లు తీశాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు
నాథన్ లియాన్ 132 మ్యాచ్‌ల్లో 533 వికెట్లు తీశాడు. యాక్టివ్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.
కోర్ట్నీ వాల్ష్ 132 మ్యాచ్‌ల్లో 519 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ బౌలర్.
డేల్ స్టెయిన్ 93 మ్యాచుల్లో 439 వికెట్లు తీశాడు. ఇప్పటికీ దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.