Brahmamudi Serial Today December 19 Highlights : పిచ్చి కళావతి మళ్లీ పడిపోయింది .. రాజ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా - బ్రహ్మముడి డిసెంబరు 19 ఎపిసోడ్ హైలెట్స్!
దుగ్గిరాలవారింటి ఆస్తిని జప్తుచేస్తామంటూ బ్యాంక్ వాళ్లు రావడంతో రుద్రాణి, ధాన్యలక్ష్మి, రాహుల్ రచ్చ చేస్తారు. రాజ్ ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా తగ్గరు. వెంటనే ఇల్లు ఖాళీ చేయాల్సిందే అంటారు బ్యాంక్ వాళ్లు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందరిమాటలు విని ఇందిరాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆయన ముందు మాట్లాడేందుకు భయపడేమీరు..ఆయనకు మతిస్థిమితం లేదనేస్తున్నారా అంటుంది. ఆస్తిలో భాగాల కోసం కోర్టుకు వెళ్తారా... చావు బతుకుల్లో ఉన్న ఆయన ఈ విషయం తెలిస్తే తట్టుకోగలరా..ఆయనకే లేనప్పుడు ఈ చిట్టి బతకదు అని కుప్పకూలిపోతుంది.
ఒక్కసారిగా నిద్రలేచిన రాజ్..ఇదంతా కలా అనుకుని నీళ్లుతాగుతాడు. ఆ డబ్బు కట్టకపోతే జరిగేది ఇదే..ఇక లోన్ కి వెళ్లడమే మంచిది అనుకుంటాడు. కొత్త మ్యాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టుకోడానికి యూనిట్ కోసం ఇన్వెస్ట్మెంట్ కావాలని రాజ్ అడిగితే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉంటే ఇస్తామంటారు
డాక్యుమెంట్స్ కళావతి పేరుమీదున్నాయ్..ఇప్పుడు ఆమె దగ్గర తలవంచాలా నా ఈగో హర్ట్ అవుతుంది అనుకుంటాడు. తాతత్య మాట నిలబెట్టుకోవడం ముఖ్యం అని... రాజ్ అండ్ అంతరాత్మ మధ్య డిస్కషన్ జరుగుతుంది.
మరోవైపు సీతారామయ్యకు ట్రీట్మెంట్ జరుగుతుంది..నిలువెత్తు మంచితన్నాన్ని మాకు దూరం చేయొద్దని కళ్యాణ్ దండం పెట్టుకుంటాడు.
రాజ్ కొత్తగా వంటలు మెచ్చుకుంటాడు..తినకముందే పొడుగుతున్నావేంటి అంటుంది ఇందిరాదేవి. కళావతి వంటకు వంక పెట్టేవాళ్లు ముష్టి ఎత్తుకుని బతకాలంటూ తెగ పొగిడేస్తాడు. రాజ్ అబద్ధం చెప్పడానికైనా అర్థం ఉండాలి.. కూరలు చప్పగా ఉన్నాయ్ అంటుంది ధాన్యం. యావదాస్తి కావ్య పేరు మీద ఉంది కాబట్టి రాజ్ కొత్తగా సోప్ వేస్తున్నాడంటుంది రుద్రాణి.
నడమంత్రపు సిరి వచ్చిన తర్వాత మొదట చేయాల్సిన పని నా మొగుడిని, అత్తను గెంటేయాలి కదా అలా చేయలేదు, మీ నోరు అదుపులో ఉంచేందుకు పనిమనిషికన్నా హీనంగా చూడాలి లేదే అని స్వప్న అనడంతో ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. రుద్రాణి, ధాన్యానికి క్లాస్ వేస్తుంది అపర్ణ
ఆస్తుల కోసం భజన చేసి బతకాల్సిన అవసరం నాకు లేదని తినకుండా వెళ్లిపోతాడు. ఛీ.. కొంచెం మనుషుల్లా ప్రవర్తించండి ..మీలాంటి రాబందులను ఎక్కడా చూడలేదంటుంది కావ్య.
కళ్యాణ్-అప్పు ఇద్దరూ మాట్లాడుకుంటారు. పాట రాస్తున్నా అని కళ్యాణ్ అంటే..ట్రైనింగ్ గురించి చెబుతుంది అప్పు.
బ్రహ్మముడి డిసెంబర్ 20 ఎపిసోడ్ లో... ఈ మధ్య రాజ్ నీకు దగ్గర అవుతున్నాడని అపర్ణ అంటుంది..మరోవైపు నీకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా అని రాజ్ అంటారు. కావ్య భుజాలపై చేయి వేయగానే సిగ్గుపడిపోతుంది.. కానీ రాజ్ ప్లాన్ అర్థం కాదు...