Satyabhama Serial Today December 18 Highlights : MLA గా గెలిపిస్తానని సత్యకు ప్రామిస్ చేసిన క్రిష్.. ఇప్పుడుంటుంది అసలు కథ- సత్యభామ డిసెంబరు 18 ఎపిసోడ్ హైలెట్స్!
విశ్వనాథం ఇంట్లో అందరూ కూర్చుని... సడెన్ గా వచ్చి పోయిన కష్టం గురించి అంతా మాట్లాడుకుంటారు. సత్య మావయ్యే కష్టాలు తీర్చేసి కొత్త జీవితం ఇచ్చారని అనుకుంటారు. పెళ్లై సంవత్సరం కాకముందే జీవితం చూపించేశావ్ అని నందినిపై సెటైర్ వేస్తాడు హర్ష. ఇద్దరూ సరదాగా కొట్టుకుంటారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఒక్కరోజు కోడలు పుట్టింటికి వస్తే అత్త రచ్చ చేయడం ఏంటి..మావయ్య వచ్చి ప్రేమ చూపించడం ఏంటి...ఇవన్నీ దేవుడు ఇచ్చిన కష్టాలు కాదు..మహదేవయ్య ఇచ్చిన కష్టాలు..కష్టాలు తొలగాయ్ కానీ సత్యముఖంలో సంతోషం లేదు అంటాడు.
అంతా సంతోషంగా ఉన్నా కానీ విశ్వనాథం డల్ గా ఉండటం చూసి విశాలాక్షి వెళ్లి ఏమైందని అడుగుతుంది. నేను జైల్లో ఉంటే సత్యను చూసేందుకు రానివ్వని ఆ పెద్దమనిషి ఇప్పుడు స్వయంగా వచ్చి ఇల్లు కొనిచ్చారని నమ్మేలా లేదు..ఓసారి ఆలోచించు సత్య పరిస్థితి అర్థమవుతుంది అంటాడు. నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అంటే సత్య దాస్తోంది అంటాడు
వాళ్ల నాన్నకి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడుతున్నా అంటే క్రిష్ ఒప్పుకోడు..ఆ గొడవ ఎక్కడివరకూ వెళుతుందో నిజం ఎలా చెప్పాలో అనుకుంటుంది. ఇంతలో క్రిష్ వచ్చి ఏంటి డల్ గా ఉన్నావ్..నీ పుట్టింటి సమస్య బాపూ తీర్చేశాడు కదా.. రేపో మాపో ఆయన MLA అయితే మన లెవెల్ పెరుగుతుంది అంటాడు
నీ భార్య ఎమ్మెల్యే అయినా ఇంత సంతోషపడతావా అంటుంది సత్య.. నువ్వు కలలు కంటున్నావని అర్థమవుతోంది..అయినా నా భార్య ఎమ్మెల్యే అవుతానంటే తిండి నిద్ర మాని నా భార్యని గెలిపిస్తా అంటాడు. అంటే మీ బాపుని వదిలేస్తావా అంటుంది. నీ ప్రచారం కలలో కదా పర్వాలేదు అంటాడు
క్రిష్ నిద్రపోతుంటే సత్య లేపి..పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. తల స్నానం చేయించాలి నలుగు పెట్టాలి అనే మాట వినగానే క్రిష్ అక్కడి నుంచి పారిపోతాడు
సత్య ఆరుబయట క్రిష్ స్నానం కోసం అన్నీ ఏర్పాటు చేస్తుంది. దాక్కున్న క్రిష్ ని బయటకు రప్పించేందుకు.. సినిమాల్లో చూపించినట్టు స్నానం చేయించాలి అనుకున్నా అంటుంది..ఆ మాట వినగానే క్రిష్ వచ్చేస్తాడు...
సత్య బర్త్ డే బాయ్ కి స్నానం చేయిస్తుంది...ఇద్దరూ సంతోషంగా కనిపించడం చూసి మహదేవయ్య కుళ్లుకుంటాడు
నీ ఆలోచన బయటపడిన రోజు ఇంట్లో పెద్ద బాంబ్ పేలుతుంది..నీ మెడలో తాళి తెంచి నీ మొగుడు అవతల పడేస్తాడని సత్యను బెదిరిస్తాడు మహదేవయ్య...