Brahmamudi Serial Today December 18 Highlights : సడెన్ గా కావ్యపై రాజ్ కి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసా- బ్రహ్మముడి డిసెంబరు 18 ఎపిసోడ్ హైలెట్స్!
దుగ్గిరాలవారింటి ఇనప్పెట్టే తాళాలు అంటే తాళలేనంత తలనొప్పి అంటుంది కావ్య. వాటిని అత్త అపర్ణ దగ్గర పెట్టేస్తుంది. ఈ మాత్రందానికే బెదిరిపోతే ఎలా..నేను అలసిపోయి నీకు తాళాలు ఇవ్వలేదు..అలవాటు అవుతుందని ఇచ్చానంటుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనువ్వు దేవతవు కాదు అందరకీ నచ్చడానికి...తప్పును తప్పు అని ధైర్యంగా చెప్పు.. వాళ్లు అడిగింది అవసరమో, కాదో తెలుసుకుని, అడిగినంత కాకుండా తగ్గించి ఇవ్వాలంటుంది. నువ్వు వెనకడుగు వేస్తే నాకు అవమానం..ధైర్యంగా నిలబడు అని ధైర్యం చెబుతుంది.
తాతయ్య పేరు చెబితే డబ్బులు ఈజీగా ఇస్తారన్నమాట..ఇకపై నా ఫ్రెండ్స్ ని ఒ్కకొక్కర్నీ రంగంలోకి దించుతాను అనుకుంటాడు రాహుల్. ఆ తర్వాత కొందరు ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఫారెన్ చదువుకోసం 50 లక్షలు అడగమంటాడు. ఇంతలో స్వప్న వచ్చి నీకు బుర్రలేదని అర్థమైందంటూ క్లాస్ వేస్తుంది.
రాహుల్ ఏం ప్లాన్ చేశాడో రుద్రాణి తెలుసుకుని...అలా వస్తే మాత్రం డబ్బులిస్తారా? తాతయ్య ఎవరికి మాటఇచ్చారో ఎంక్వైరీ చేయకుండానే ఇస్తారా అని క్లాస్ వేస్తుంది.
కాఫీ ఇవ్వలేదని రాజ్ అడిగితే రాత్రి ఇస్తే అరిచారు కదా అంటుంది. ప్రతిసారీ అరిచేవాడిలా కనిపిస్తున్నానా అంటే.. అనలేదు జరిగినవి చెబుతున్నా అంటుంది. ఎస్ ఐ కాల్ చేసి..ఫేక్ గాడు.. బ్యాంకాక్ వెళ్లాడని అక్కడినుంచి వేరే కంట్రీకి వెళ్లాడని చెబుతాడు.
కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన కావ్యపై ఫైర్ అవుతాడు రాజ్..ప్రైవసీ ఇవ్వవా అంటాడు. ఆ మాటలు విన్న అపర్ణ పరాయివాడిముందు నీ భార్యను అవమానిస్తావా అని కోప్పడుతుంది. సారీ కళావతి అనేసి అక్కడినుంచి వెళ్లిపోతాడు.
ఏదో జరుగుతోంది..ఎందుకో కంగారుపడుతున్నాడు..వెళ్లి మాట్లాడాలి అనుకుంటుంది కావ్య. ఏం జరిగిందని అడుగుతుంది. తెలిస్తే ఆరుస్తావా తీరుస్తావా అంటాడు. శత్రుసైన్యం, దండయాత్ర అని వెటకారంగా చెబుతాడు రాజ్. నాకు సైనికులు లేరులెండి వన్ విమెన్ ఆర్మీ అంటూ వెళ్లిపోతుంది.
బ్యాంక్ వాళ్లు ఇంటికి వచ్చి సీతారామయ్య వంద కోట్లకు షూరిటీ విషయం బయటపెట్టేస్తారు. ఆస్తులు జప్తు చేస్తాం అంటే..కనీసం నోటీస్ ఇవ్వాలికదా అంటాడు సుభాష్. మీ ఆఫీస్ లో ఇచ్చాం..రాజ్ గారు టైమ్ అడిగారని చెబుతారు. ఇమిడియట్గా ఇల్లు ఖాళీ చేయండి అంటారు.
ముసలోడు నిలువునా ముంచేశాడు..రోడ్డుమీద నిలబెట్టేశాడు అని రుద్రాణి రచ్చ మొదలెడుతుంది. నోరు జారకు అంటుంది ఇందిరాదేవి. ఇంకా ముసలోడికి గౌరవం ఇచ్చేదేంటి అంటూ..ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది.
నాకొడుకు ఆటో నడుపుతుంటే వాడిపై పడి తినాలి..ఇన్నాళ్లూ కోడలిని రానివ్వలేదు అది రానిస్తుందా అని శోకాలు తీస్తుంది ధాన్యలక్ష్మి. కుటుంబం అంటే మీ ఇద్దరేనా అందరం కలసి పంచుకుందా అని అపర్ణ అంటే..ఇంకా ఇక్కడ ఏం మిగిలింది ముసలోడు మా నోట్లో మట్టికొట్టాడు అని ఫైర్ అవుతారు.
బ్రహ్మముడి డిసెంబర్ 13 ఎపిసోడ్ లో...కావ్య బూజు దులుపుతుంటే రాజ్ వచ్చి సడెన్ గా పిలుస్తారు..కావ్య ఉలిక్కిపడి వెనక్కుపడబోతుంటే రాజ్ పట్టుకుంటాడు. కాసేపు కళ్లు కళ్లు కలుస్తాయి. వాళ్లను ధాన్యలక్ష్మి, రుద్రాణి చూస్తారు..