Satyabhama Serial Today December 14 Highlights : సత్య క్లీన్ బౌల్డ్ .. ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ బిగ్ షాక్ ఇచ్చిన మహదేవయ్య - సత్యభామ డిసెంబరు 14 ఎపిసోడ్ హైలెట్స్!
మహదేవయ్యను డబ్బు అడిగి తీసుకొచ్చిన క్రిష్ అప్పులవాళ్లకి ఇస్తాడు. వాళ్లు నోర్మూసుకుని వెళ్లిపోతుంటే తన మావయ్యని అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తాడు. క్రిష్ మహదేవయ్య కొడుకు అని తెలుసుకుని వాళ్లు క్షమించమని అడుగేసి వెళ్లిపోతారు..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాకోసం నీకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నావ్..ఇప్పుడు వదినను ఎంత ఇష్టపడుతున్నావో నాకు తెలుసు. వదిన కూడా నిన్ను అంతే ఇష్టపడుతోంది. మైత్రి ఎప్పటికైనా మూడో వ్యక్తే అవుతుంది..ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అన్నయ్యా అని చెబుతుంది. ఈ విషయంలో బావగారి సాయం మర్చిపోలేను..నందినిని కూడా బాధపెట్టను అని సత్యకు మాటిస్తాడు హర్ష...
సత్య ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసిన మహదేవయ్యతో..బావున్నారా మావయ్య కాని మావయ్య అన అడుగుతుంది. నిప్పుల్లోకి తోసోసినా కాపాడేలా చేసుకున్న నీ తెలివికి మెచ్చుకుందాం అని కాల్ చేశా అంటాడు. మరో సమస్య రాబోతోంది సిద్ధంగా ఉండు.. నువ్వు ఎప్పటికీ పుట్టింట్లోనే ఉంటావ్.. క్రిష్ ని కూడా నీతో ఉండనీయను అని సవాల్ చేస్తాడు
మహదేవయ్య కాల్ కట్ చేసిన సత్య ఆలోచనలో పడుతుంది..ఇంతలో క్రిష్ వచ్చి నన్ను రమ్మని బాపు చెప్పాడు..రేపు హైదరాబాద్ వెళ్లాలి ఒక్కరోజులో వచ్చేస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు...
బాధపడుతున్న విశ్వనాథాన్ని ఓదార్చుతుంది విశాలాక్షి.. 25 లక్షలు అప్పు పెద్ద సమస్యే కదా అంటాడు. నేనూ అదే ఆలోచిస్తున్నా అంటాడు. సమస్యల నుంచి పోరిపోవాలా అని మాట్లాడుతుంది సత్య..ఇంతలో ఇల్లు కొలతలు కొలిచేందుకు వచ్చాం అంటారు. కాసేపట్లో కూల్చబోతున్నా ఇది మీ ఇల్లు కాదంటారు.
పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సత్య అంటే డాక్యుమెంట్స్ అతని దగ్గరున్నాయ్ అంటుంది సత్య. మా బాపుకి కాల్ చేస్తానంటుంది నందిని. సత్య అడ్డుకుంటుంది ఎవరి సహాయం అవసరం లేదంటుంది. ఆయన మంచి పనులకు ఉపయోగపడడు అంటూ..ఈ మొత్తం జరగడానికి కారణం ఆయనే అంటుంది సత్య..
మా బాపు మనజోలికి ఎందుకొస్తాడని నందిని నిలదీస్తుంది.. నువ్వు పుట్టింటికి రావడం మానేశావ్ అందుకే నీపై కోపం ఈ ఇంట్లోవాళ్లపై తీర్చుకుంటున్నాడు. నేనన్నా కూడా పడదు.. అందుకే ఇదంతా అంటుంది సత్య. బాపుతో తాడో పేడో తేల్చుకుంటా అంటూ పుట్టింటికి బయలుదేరుతుంది నందిని..
సంధ్య కాల్ చేస్తాడు సంజయ్. ఇంట్లో టెన్షన్స్ గురించి చెబుతుంది. ఈ సమస్యలన్నీ మీ అక్కవల్లే అంటాడు సంజయ్. మీ అక్క తీరు మా ఇంట్లో సరిగా ఉండదు.. మా పెదనాన్న తలుచుకుంటే మీ సమస్యలు తీరిపోతాయ్ కానీ మీ అక్క పద్ధతి మార్చుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయ్ అని సత్యపై వ్యతిరేకత నింపుతాడు
భోజనం చేస్తున్న మహదేవయ్యను అప్పుడే ఇంటికెళ్లిన నందిని నిలదీస్తుంది. ఇంత గొప్ప తండ్రి దొరికాడంటే నేను ఏ పాపం చేశానో అంటుంది. భైరవి ఫైర్ అవుతుంది
సత్యభామ డిసెంబర్ 16 ఎపిసోడ్ లో కాసేపట్లో ఇల్లు కూల్చేయబోతున్నారని విశ్వనాథం బాధపడతాడు. మా బాపు బంగ్లా కొనిస్తానన్నాడు అంటూ నందిని వస్తుంది. అదంతా అబద్ధం అని సత్య అంటుంది. మా బాపు అబద్ధం చెప్పడు అంటూ క్రిష్ వస్తాడు.ఆ వెనుకే మహదేవయ్య ఎంట్రీ ఇస్తాడు...