Brahmamudi Serial Today December 14 Highlights : రోడ్డుమీదకు దుగ్గిరాల కుటుంబం.. రాజ్ కి ఇక కావ్యే దిక్కు - బ్రహ్మముడి డిసెంబరు 14 ఎపిసోడ్ హైలెట్స్!
దుగ్గిరాల వారింటి పరిస్థితి చూసి కనకం బాధపడుతుంది. బయటివాళ్లంతా మా మంచి కోరుకుంటే ఇంట్లోవాళ్లంతా మా బావ చావు కోరుకుంటున్నారని ఇందిరాదేవి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. రుద్రాణి , ధాన్యలక్ష్మి అన్న మాటలకు నేను క్షమాపణలు చెబుతున్నా అంటుంది. కనకం, కావ్య..ఇందిరాదేవిని ఓదార్చుతారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆఫీస్ లో ఉన్న రాజ్ దగ్గరకు బ్యాంక్ వాళ్లు వస్తారు. మీ తాతగారు తన ఫ్రెండ్ చిట్ ఫండ్ కంపెనీకి వందకోట్లకు ష్యూరిటీ పెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు కంపెనీని నడిపించాడు..ఆ కంపెనీ ఇప్పుడు బోర్డు తిప్పేసింది మీ తాతగారు ఇచ్చిన ష్యూరిటీ సంతకం ప్రకారం ఆ మొత్తం మీరు చెల్లించాలంటారు
వందకోట్లు కట్టకపోతే ఆస్తిని జప్తు చేయాలంటారు..కొంచెం టైమ్ కావాలని రాజ్ అడిగితే..అంత టైమ్ ఇవ్వలేం అంటారు. వందకోట్లు కట్టేందుకు అగ్రిమెంట్ పై సంతకం పెడితే బ్యాంక్ మీకు పదిరోజులు టైమ్ ఇస్తుంది అంటారు బ్యాంక్ వాళ్లు. లేదంటే మీ ఆస్తి, ఇల్లు ఇప్పుడే జప్తు చేస్తాం అంటారు.
ఆస్తి మీ తాతగారిపేరుమీద లేదు..కావ్య పేరుమీద ఉంది అందుకే మీరు సంతకం చేసేయండి సర్ పర్వాలేదు అంటాడు మేనేజర్. అప్పుడు అంతా మా తాతగారిని తప్పుగా అనుకుంటారు కదా అంటే ఆయన కోమాలో ఉన్నారు కదా పర్వాలేదు లెండి అంటాడు మేనేజర్. కాలర్ పట్టుకున్న రాజ్.. మా తాతగారి గురించి అంతా గొప్పగా మాట్లాడుకోవాలి అంటాడు..సైన్ చేసేస్తాడు
రుద్రాణి వచ్చి సుభాష్ ని డబ్బులు అడిగితే..మొత్తం కావ్య చేతిలోనే ఆమెనే అడగండి అంటాడు. ఇప్పుడు దానికి కారణాలు చెప్పాలా అని ఫైర్ అవుతుంది రుద్రాణి. తను అనుబంధాలకు విలువఇస్తుంది కాబట్టి కారణాలు అడగదులే మమ్మీ అని సర్దిచెబుతాడు రాహుల్.
కావ్యను రెండు లక్షలు అడుగుతుంది. నిజంగా అవసరం అయ్యే అడుగుతోందా లేదంటే టెస్ట్ చేసేందుకు అడుగుతోందా అనుకుంటుంది కావ్య. ఎందుకో చెబితే ఇస్తానంటుంది కావ్య.. ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి కారణాలు అడిగి మమ్మల్ని అవమానించకు అంటుంది. ఎందుకు ఖర్చు చేస్తున్నారో చెబితే రాసుకుంటా నంటుంది. అది మేం చూసుకుంటాంలే అంటుంది ధాన్యలక్ష్మి. కావ్య డబ్బు ఇస్తుంది.
శ్రుతి ఫైల్స్ తీసుకొచ్చి సంతకం పెట్టమంటే రాజ్ ఫైర్ అవుతాడు. పది రోజుల్లో వందకోట్లు అంటే కష్టం కదా అని ఆలోచిస్తుంటాడు రాజ్. తాతయ్య మంచితనం..తన స్నేహితుడి స్వార్థం ఇంతమంది జీవితాలను రోడ్డున పడేస్తుందా..అలా జరగడానికి వీల్లేదు అనుకుంటాడు. రాజ్ కంగారు చూసి శ్రుతి ఆలోచనలో పడుతుంది
రాజ్ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటాడు.. యాక్సిడెంట్ అవబోతుంటే కార్ డ్రైవర్ గట్టిగా పిలుస్తాడు. హలో బాస్ రోడ్డు అనుకుంటున్నావా, పార్క్ అనుకుంటున్నావా అని క్లాస్ వేస్తాడు.
బ్రహ్మముడి డిసెంబర్ 16 ఎపిసోడ్ లో...బోర్డు తిప్పేసిన వ్యక్తిగురించి పోలీసులు గాలిస్తుంటారు.. నందగోపాల్ ఉన్నాడా అని రాజ్ వాచ్ మెన్ ని అడిగితే కొద్దిసేపటి క్రితం ఫారెన్ వెళ్లారని చెబుతాడు వాచ్ మెన్. ఈ వందకోట్లు ఎలా కట్టాలి..కళావతి సాయం తీసుకోవాలి అనుకుంటాడు..